సీఈసీకి పంపే లిస్టుపై తెలంగాణ డీజీపీ కసరత్తు

కేంద్ర ఎన్నికల సంఘానికి పంపే లిస్టుపై తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కసరత్తు చేస్తున్నారు.హైదరాబాద్ సీపీ రేసులో మహేశ్ భగవత్, షికా గోయల్, శివధర్ రెడ్డి, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు నాగిరెడ్డి, సజ్జనార్ ఉన్నారు.

 Telangana Dgp Is Working On The List To Be Sent To Cec-TeluguStop.com

కాగా ముగ్గురు పేర్లతో ప్రభుత్వం లిస్టును సీఈసీకి పంపించనుంది.

మరోవైపు బదిలీ అయిన ఎస్పీలు, కమిషనర్లు నిన్న రాత్రి 12 గంటలకే రిలీవ్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఇంఛార్జ్ లకు బాధ్యతలు అప్పగించారు.అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ విడుదలైన తరువాత పోలీస్ శాఖలో బదిలీల వ్యవహారం సంచలనంగా మారింది.

హైదరాబాద్ సీపీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలువురు కమిషనర్లు, ఎస్పీలు దాదాపు 13 మందిని బదిలీలు చేస్తూ ఉత్తర్వులు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వారి స్థానంలో కొత్త లిస్టును పంపాలని సీఈసీ తెలంగాణ సర్కార్ కు ఆదేశాలు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో జాబితాను ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube