టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కోర్టు ప్రారంభం కాగానే ముందస్తు బెయిల్ పిటిషన్లపై అత్యవసర విచారణ జరపాలంటూ చంద్రబాబు తరపు లాయర్లు నిన్న న్యాయమూర్తిని కోరారు.అందుకు నిరాకరించిన జడ్జి సాధారణ పద్ధతిలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు.
ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.