చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.
ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కోర్టు ప్రారంభం కాగానే ముందస్తు బెయిల్ పిటిషన్లపై అత్యవసర విచారణ జరపాలంటూ చంద్రబాబు తరపు లాయర్లు నిన్న న్యాయమూర్తిని కోరారు.
అందుకు నిరాకరించిన జడ్జి సాధారణ పద్ధతిలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు.
ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
దేవర ముంగిట నువ్వెంత.. థియేటర్లలో పుష్ప2 రిలీజవుతున్నా అక్కడ దేవర హవా!