రాజన్న సిరిసిల్ల జిల్లా :లండన్ ( London )లో రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి హత్యకు గురైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet ) రాచర్ల బొప్పాపురం గ్రామానికి చెందిన చాంద్ పాషా కుమారుడు రైసుద్దిన్ గత శనివారం హత్యకు గురైనట్లు సమాచారం.
మృతుడు గత 13 ఏళ్లుగా లండన్ లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డాడు.
తను ఉన్న సమీపంలో వేరే వ్యక్తులు గొడవ పడుతుండగా అడ్డుగా వెళ్లిన రైసుద్దీన్ ( Raisuddin )ను దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది.
మృతుని కూతురు వివాహం అక్టోబర్ 5న హైదరాబాదులో జరిపించుటకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలో హత్యకు గురి కావడం పట్ల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.బంధువులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు.
మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.