ప్రస్తుత కాలంలో 10 రూపాయలతో ఆటోలో కొంత దూరం ప్రయాణం చేయడం కూడా సాధ్యం కాదు.మారుతున్న కాలానికి అనుగుణంగా అంచనాలకు మించి ఖర్చులు పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
అయితే కర్ణాటక రాష్ట్రంలోని ఆదర్శ( Adarsha Hospital ) అనే ఆస్పత్రికి చెందిన వైద్యులు కేవలం 10 రూపాయల కన్సల్టేషన్ ఫీజుతో మంచి మనస్సును చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఈ ఆస్పత్రి ఫౌండర్ పేరు ఎంకే ప్రసాద్( MK Prasad ) కాగా కొంతకాలం పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేసిన ప్రసాద్ సంపాదించిన డబ్బుతో ఆస్పత్రిని మొదలుపెట్టి తక్కువ ఫీజుతో వైద్య సేవలను అందిస్తూ ప్రజల మనస్సులను గెలుచుకుంటున్నారు.
కేవలం 10 రూపాయలకే( 10 Rupees Doctor ) సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తూ ఎంకే ప్రసాద్ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని( Karnataka ) పుత్తూర్ లో ఈ ఆస్పత్రి ఉందని తెలుస్తోంది.పూత్తూర్ బస్టాండ్, రైల్వే స్టేషన్ కు దగ్గర్లో ఈ ఆస్పత్రి ఉండగా కన్సల్టేషన్ ఫీజు తక్కువే అయినా రోగుల విషయంలో ఈ ఆస్పత్రిలో స్పెషల్ కేర్ తీసుకుంటారని తెలుస్తోంది.ఈ ఆస్పత్రిలో ఉన్న వైద్యులు అందరూ అనుభవం ఉన్న వైద్యులు కావడం గమనార్హం.
ఈ ఆస్పత్రిలో రోగుల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారని తెలుస్తోంది.
ఈ ఆస్పత్రి కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ ఆస్పత్రులలో ఒకటిగా పేరు తెచ్చుకుంది.ఈ ఆస్పత్రి గురించి తెలిసి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది వైద్యం కోసం ఈ ఆస్పత్రికి వెళుతున్నారని సమాచారం అందుతోంది.ఆదర్శ ఆస్పత్రి వైద్య సేవలు కలకాలం కొనసాగాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
రోజురోజుకు వైద్యం ఖరీదవుతున్న నేపథ్యంలో ఎంకే ప్రసాద్ లాంటి మహానుభావులు తక్కువ ధరకే వైద్యం అందించడం వల్ల ఎంతోమందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.ఎంకే ప్రసాద్ ను ఎంత పొగిడినా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.