రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) కి గీత గోవిందం మరియు అర్జున్ రెడ్డి సినిమా లతో మంచి గుర్తింపు వచ్చింది అనడంలో సందేహం లేదు.హీరో గా విజయ్ దేవరకొండ లేడీ ఫ్యాన్స్ కి దగ్గర అయింది కచ్చితంగా గీత గోవిందం అనడం లో ఎలాంటి సందేహం లేదు.
ఆ సినిమా లో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.గీత గోవిందం సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో డియర్ కామ్రేడ్ సినిమా( Dear Comrade ) వచ్చింది.
ఆ సినిమా నిరాశ పరిచింది.అయినా కూడా వీరి కాంబోలో మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.వీరిద్దరు కలిసి మళ్లీ ఎప్పుడు నటిస్తారు అంటూ ఎదురు చూస్తున్న వారికి గౌతమ్ తిన్ననూరి( Gowtam Tinnanuri ) నుంచి అతి త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఒకటి కాదు ఏకంగా రెండు సినిమా లతో వీరిద్దరు కలిసి రాబోతున్నారట.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోతున్న మూవీ లో విజయ్ దేవరకొండ కి జోడీగా రష్మిక మందన్నా( Rashmika Mandanna ) నటించబోతుంది.ఆ సినిమా లో వీరిద్దరి కాంబో సన్నివేశాలు, రొమాన్స్ యూత్ ఆడియన్స్ కి పిచ్చెక్కించడం ఖాయం అంటున్నారు.
ఇక ఆసక్తికర విషయం ఏంటి అంటే ఈ జోడీ తో గౌతమ్ తిన్ననూరి ఏకంగా రెండు పార్ట్ లుగా సినిమా ను చేయబోతున్నాడట.అంటే రెండు భాగా ల్లో సినిమా ను చూడబోతున్నాం.అంతే కాకుండా రెండు సినిమా ల్లో వీరిద్దరిని చూడబోతున్నాం అంటూ ఫ్యాన్స్ లో కొంత మంది అప్పుడే సంబరం మొదలు పెట్టారు.అయితే అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు ప్రకటన రాలేదు.
ముందు ముందు క్లారిటీ వచ్చేనమో చూడాలి.ప్రస్తుతం రౌడీ స్టార్( Rowdy hero ) చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో సినిమా ను మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.