ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.వాయిదా అనంతరం అసెంబ్లీ తిరిగి ప్రారంభం కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై చర్చ జరుగుతోంది.
ఇందులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఓ చీకటి ఒప్పందం అని చెప్పారు.ఎంవోయూ అంతా ఫేక్ అన్న ఆయన దానికి సంబంధించిన పేపర్లపై తేదీలు కూడా లేవని తెలిపారు.
స్కాంలో డిజైన్ టెక్ అనే కంపెనీకి ముందుగా మనీ ట్రాన్సఫర్ చేశారన్నారు.తరువాత షెల్ కంపెనీలకు ఆ నగదు ట్రాన్స్ ఫర్ అయిందని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఓ షెల్ కంపెనీకి రూ.241 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశారని వెల్లడించారు.స్కిల్ డెవలప్ మెంట్ పథకానికి ఫైనాన్స్ అప్రూవల్ లేదని ఐఏఎస్ అధికారిణి సునీత చెప్పారని గుర్తు చేశారు.