బీజేపీ నేతలపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీజేపీకి తాను దూరం అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
చిట్ చాట్ ల పేరుతో ఏదో ఒక వ్యూహాంతో కార్యాచరణ తనకు అలవాటు లేదని ట్విట్టర్ ఎక్స్ వేదికగా విజయశాంతి పేర్కొన్నారు.ఈ క్రమంలోనే పార్టీ ముఖ్యనేతలకు ఈనెల 16వ తేదీన నిర్వహించిన సమావేశంలో స్పష్టంగా తెలిపానన్నారు.
పార్టీకి ఏది ముఖ్యమో ఆ అంశాలను చెప్పానన్న విజయశాంతి ఆ విషయాలు బయటకు లీకేజ్ ల పేరుతో ఇవ్వడానికి తాను వ్యతిరేకమని తెలిపారు.అయితే ఇదంతా తెలిసి కూడా కొందరు తమ పార్టీ నేతలే పనిగట్టుకుని బీజేపీకి రాములమ్మ దూరం అంటూ తనపై ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.