ఏఎన్ఆర్ గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు.. నన్ను చూసి లేచి నిలబడేవారంటూ?

తాజాగా అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) శత జయంతి వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.ఈ వేడుకలకు టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు సెలబ్రిటీలు హాజరయ్యారు.

 Mohan Babu Remembers Memories With Akkineni Nageswara Rao At Anr 100th Birthday-TeluguStop.com

ఈ సందర్భంగా ఈ వేడుకలకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు( Mohan Babu ) సైతం హాజరయ్యారు.స్టూడియోలో ఏర్పాటుచేసిన ఏఎన్నార్( ANR ) నిలువెత్తు కాంస్య విగ్రహానికి నివాళులు అర్పించిన తరవాత కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

అలాగే నాగేశ్వరరావుతో తనకు ఉన్న అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.

Telugu Anr, Mohan Babu, Tollywood-Movie

అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడాలి అంటే నేను ఒక పెద్ద పుస్తకాన్ని రాయొచ్చు.మా ఇద్దరికి ఉన్నటువంటి బంధం, అనుబంధం అలాంటిది.నేను తిరుపతిలో చదువుకునేటప్పుడు నాగేశ్వరరావు గారి సినిమా 100 రోజుల ఫంక్షన్ జరుగుతుంది అంటే అక్కడికి వెళ్లి ఆయన్ని చూద్దామని ప్రయత్నించి చొక్కా చించుకుని రూముకి వెళ్లినవాడిని.మళ్లీ ఆ చొక్కా కుట్టించుకోవడానికి కూడా డబ్బుల్లేవు.

అటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారితో సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం నాకు దక్కింది.నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు( Nageswara Rao, SV Ranga Rao ) గారు పనిచేసిన మరపురాని మనిషి సినిమాకు నేను అసోసియేట్‌గా పనిచేశాను అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

Telugu Anr, Mohan Babu, Tollywood-Movie

అలాగే ఒక సందర్భం గురించి మాట్లాడుతూ. అన్నపూర్ణ స్టూడియోలోనే( Annapurna studio ) సినిమా చేస్తున్నప్పుడు నా కంటే ముందుగానే నాగేశ్వరరావు సెట్‌కు వెళ్లి కూర్చున్నారు.నా కన్నా ముందే వెళ్లి ఫ్లోర్ ముందు నాగేశ్వరరావు గారు కూర్చున్నారు.నేను లేటుగా వెళ్లాను.నమస్కారం సర్ అన్నాను.ఏంటయ్యా అలా ఉన్నావు అన్నారు.

నాకొక కోరిక ఉంది సర్ అన్నాను.దాసరి నారాయణరావు లోపల ఉన్నారు, మీరేమో బయట ఉన్నారు.

ప్రతిసారీ మీరొస్తే నేను లేచి నిలబడాలా? నేనొస్తే మీరు లేచి నిలబడాలని కోరిక కోరుకుంటున్నాను సర్ అన్నాను.అమ్మ లమ్మిడీ కొడకా నీకు అంత కోరిక ఉందా అన్నారు.

మరుసటి రోజు ఇదే ఫస్ట్ ఫ్లోర్‌లో నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు గారు బయట ఉన్నారు.నేను మేకప్ వేసుకుని వెళ్లాను.ఇద్దరూ లేచి నిలబడ్డారు.ఇదేంటి సర్ ఇద్దరూ లేచి నిలబడ్డారు అని అడిగాను.

లేదులే.నీ కోరిక కదా, అందుకే మేమిద్దరం లేచి నిలబడ్డాం అన్నారు.

అలాంటి చమత్కారాలు నాగేశ్వరరావు గారిదో ఎన్నో ఉన్నాయి అని మోహన్ బాబు నవ్వుతూ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube