తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది.పలు పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
చేరికలు పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో సైతం ఉత్సాహం పెరిగింది.
యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు నేతలు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరారు.
నిన్న కూడా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, జిట్టా బాలకృష్ణారెడ్డి చేరిన సంగతి తెలిసిందే.ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఇంకా చేరికలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఓ వైపు సీడబ్ల్యూసీ సమావేశాలు, తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో కాంగ్రెస్ కు చెందిన అతిరథ మహారథులు అంతా హైదరాబాద్ లోనే ఉన్నారు.