ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.రాష్ట్రంలో రానున్న ఎన్నికలు ప్రతిపక్షం వర్సెస్ వైసీపీ మధ్య ఉంటుందని తెలిపారు.
ఈ పోటీని తోడేళ్ల గుంపు, సింహంతో పోల్చవచ్చని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.అధికారం కోసం దురాశకు, ప్రజా సంక్షేమానికి మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు.
యూటర్న్ రాజకీయాలు వర్సెస్ విశ్వసనీయత అని చెప్పారు.అవకాశవాదానికి, నిజాయితీకి మధ్య ఈ ఎన్నికలు ఉంటాయని వ్యాఖ్యానించారు.
అయితే ఇప్పటికే బీజేపీతో పొత్తుతో ఉన్న జనసేన నిన్న టీడీపీతో కూడా పొత్తులో ఉంటుందని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి.