ఎలక్ట్రిక్ స్కూటర్లలో( Electric Scooters ) పవర్ చాలా తక్కువగా ఉంటుందని, అవి ఎక్కువ బరువును తీసుకెళ్లలేవని భావన కొంతమందిలో ఉంది.అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లు పెట్రోల్ వాటితో సమానంగా శక్తిని జనరేట్ చేసేలా కంపెనీలు తయారు చేస్తున్నాయి.
పవర్ ఫుల్ మోటార్స్, దృఢమైన బిల్ట్ క్వాలిటీ, లాంగ్ రేంజ్ ఫెసిలిటీని ఎలక్ట్రిక్ స్కూటర్లలో అందజేస్తున్నాయి కాగా తాజాగా ఒక కంపెనీ రెండు హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది.అవి చాలామందిని ఆకట్టుకుంటున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.షెమా ఎలక్ట్రిక్( Shema Electric ) ఈగల్+, టఫ్+ అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది.టఫ్ + ( TUFF+ ) అనేది కార్గో స్కూటర్, ఇది 150 కిలోల వరకు మోయగలదు.దీని గరిష్ట వేగం గంటకు 60 కి.మీ.ఈగల్+( Eagle+ ) అనేది 50 కిమీ/గం గరిష్ట వేగంతో దూసుకెళ్లే ప్యాసింజర్ స్కూటర్.ఇది 120 కిలోల బరువును ఈజీగా తీసుకెళ్లగలదు.రెండు స్కూటర్లలో బ్లూటూత్ స్పీకర్లు, యాంటీ-థెఫ్ట్ అలారాలు, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌లు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఈగిల్+ వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్ అయిన స్వాపబుల్ బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతుంది.
ఈ స్కూటర్లు ఇప్పుడు భారతదేశంలోని షెమా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.టఫ్ + ప్రారంభ ధర రూ.1,39,999 (ఎక్స్-షోరూం).ఈగల్+ రూ.1,17,199 వద్ద ప్రారంభమవుతుంది.వీటిపై ప్రభుత్వ రాయితీలు పొందవచ్చు.షెమా ఎలక్ట్రిక్ భారతదేశాన్ని మరింత శక్తివంతంగా, స్థిరంగా మార్చడానికి కట్టుబడి ఉంది.కంపెనీ కీలకమైన ఈవీ డిస్ట్రిబ్యూటర్లు, మార్కెట్‌ప్లేస్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది.ఇప్పటి వరకు 20,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి రిలీజ్ చేసింది.
దాని ప్రొడక్ట్స్ రేంజ్‌తో భారతదేశం క్లీన్ మొబిలిటీ ఫ్యూచర్ వైపు అడుగులు వేయడానికి షీమా ఎలక్ట్రిక్ తన వంతు కృషి చేస్తుంది.