ఒక సినిమా సక్సెస్ కొడితే చాలు ఆ సినిమాలో ఉన్న అందరికీ మార్కెట్ లో మంచి డిమాండ్ పెరుగుతోంది.నటుల దగ్గర నుంచి సాంగ్స్ రాసే రైటర్స్ వరకు అందరికీ సినిమా ఇండస్ట్రీ లో ఎనలేని గొప్ప పేరు అయితే లభిస్తుంది నిజానికి ఈ సినిమా ఇండస్ట్రీ లో హిట్టు సినిమా ల సంఖ్య కంటే ప్లాప్ సినిమాల లిస్ట్ ఎక్కువ గా ఉంటుంది.
మరి ఇలాంటి నాసి రకమైన కథలతో వచ్చి ప్రొడ్యూసర్( Producer ) ని మోసం చేసే డైరక్టర్ల కు వాళ్ళు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అంటూ చాలా మంది ప్రొడ్యూసర్లు వాపోతున్నారు నిజానికి అయితే ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది యంగ్ డైరెక్టర్లు మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు మేము మా టాలెంట్ ని నిరూపించుకుంటాం అని అనుకుంటుంటే అదే టైంలో ప్రొడ్యూసర్లు ఎందుకు వాళ్ళని నమ్మాలి అని చాలామంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు…
అందుకే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy vanga )లాంటి డైరెక్టర్ ని కూడా మొదట ప్రొడ్యూసర్లు నమ్మకపోవడం స్టోరీ ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం లాంటివి చేసిన తర్వాత ఇక లాభం లేదని సందీప్ వాళ్ల నాన్న ను రిక్వెస్ట్ చేసి వాళ్ల అన్నయ్యని ప్రొడ్యూసర్ గా పరిచయం చేసి అర్జున్ రెడ్డీ ( Arjun Reddy )లాంటి ఒక హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తీశాడు.నిజానికి సందీప్ రెడ్డి దగ్గర టాలెంట్ ఉన్న కూడా కొంత మంది డైరెక్టర్లు మొదటి సినిమా తో ప్రొడ్యూసర్లను ముంచడం ద్వారా వాళ్ళు ఇలాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్లను కూడా నమ్మడం లేదు…అందుకే సందీప్ భద్రకాళి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అర్జున్ రెడ్డి సినిమా చేసి హిట్ కొట్టాడు…ఇప్పుడు డైరెక్ట్ గా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్నాడు…