చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతోనే గోపీచంద్ శ్రీనువైట్ల రాబోతున్నారా... ఇంత కథ ఉందా?

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్( Gopichand ) గత కొంతకాలంగా నటిస్తున్నటువంటి సినిమాలు ఏవి ఆయనని సంతృప్తి పరచడం లేదు.ఇలా గోపీచంద్ నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాలను ఎదుర్కోవడంతో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.

 Interesting News Goes Viral About Gopichand Sreenuvaitla Movie Full Details He-TeluguStop.com

గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ రామబాణం వంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.ప్రస్తుతం ఈయన కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో భీమా( Bheema ) అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాపై పెద్దగా బజ్ అయితే లేదు.ఇది గోపీచంద్ కు 31వ చిత్రం కావడం విశేషం ఇక తన తదుపరి చిత్రాన్ని శీను వైట్ల దర్శకత్వంలో చేయబోతున్నారు.

Telugu Bheema, Chiranjeevi, Gopichand, Ramabanam, Sreenu Vaitla, Tollywood-Movie

గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్నటువంటి శ్రీను వైట్ల( Sreenu vaitla ) కు గోపీచంద్ అవకాశమిచ్చి రిస్క్ చేస్తున్నారని అందరూ భావించారు.అయితే తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా ఎంతో ఘనంగా జరుపుకుంది.గోపీచంద్ శ్రీనువైట్ల కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా వెనుక చాలా కథ ఉందని తెలుస్తుంది.మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) రిజెక్ట్ చేసిన కథతోనే శీను వైట్ల గోపీచంద్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాతో వీరిద్దరూ హిట్ అందుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని తెరపైకి తీసుకువస్తున్నారు.

Telugu Bheema, Chiranjeevi, Gopichand, Ramabanam, Sreenu Vaitla, Tollywood-Movie

మెగాస్టార్ చిరంజీవి కోసం శీను వైట్ల ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు.అయితే ఈ స్క్రిప్ట్ చిరంజీవికి వినిపించడంతో చిరంజీవి వరుస ఫ్లాప్ లతో ఉన్నటువంటి శీను వైట్లతో సినిమా చేయడం ఎందుకు రిస్క్ అని చెప్పి తనకు అవకాశం కల్పించలేదట ఇలా చిరంజీవితో చేయాలనుకున్నటువంటి సినిమానే శీను వైట్ల ప్రస్తుతం గోపీచంద్ తో చేయబోతున్నారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. మెగాస్టార్ కోసం తయారుచేసిన ఈ కథతో శీను వైట్ల గోపీచంద్ ఇద్దరు కూడా సక్సెస్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.

మరి వీరీ ప్రయత్నం ఎంతవరకు వీరికి ఫలితాలను అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube