తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు , క్షేత్రస్థాయిలోకి బిజెపి( BJP ) విధానాలను తీసుకువెళ్లేందుకు ఏం చేయాలనే విషయంపై బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారులు, జిల్లా అధ్యక్షులు సమావేశంలో అనేక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జిలు ప్రకాష్ జవదేకర్ సునీల్ బన్సాల్ , తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ( Kishan Reddy )పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ సోయం బాపూరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొని కీలక అంశాలపై చర్చించారు .
ఈ సందర్భంగా ఈనెల 17న హైదరాబాద్ విమోచన వేడుకలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
అలాగే ఈనెల 26, 27 ,28 తేదీల్లో తెలంగాణలో మూడు వైపుల నుంచి భారీ రథయాత్రలు చేపట్టాలని ప్లాన్ చేశారు .బాసర నుంచి హైదరాబాద్ వరకు ఒక ముఖ్య నేత నేతృత్వంలో యాత్ర, సోమశిల నుంచి హైదరాబాద్ వరకు మరో ముఖ్యమైన ఆధ్వర్యంలో యాత్ర , భద్రాచలం నుంచి హైదరాబాదు వరకు ఇంకో నేత ఈ బస్సు యాత్రల బాధ్యతలను నిర్వహించబోతున్నారు.19 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్లు మేర యాత్రలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.పార్టీ క్యాడర్ లో జోష్ నింపి బిజెపిపై జనాల్లో ఆదరణ మరింత పెంచే విధంగా చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు బస్సు యాత్రలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఏ నేత ఎక్కడి నుంచి ఈ బస్సు యాత్రను( bus trip ) ప్రారంభించాలనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు.
కిషన్ రెడ్డి ,ఈటెల రాజేందర్ ఈ యాత్రను లీడ్ చేయబోతున్నట్లు సమాచారం.మరో ముఖ్య నేత విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.బీఆర్ఎస్ , కాంగ్రెస్ , ఎంఐఎం ( BRS, Congress, MIM )పార్టీలు ఒకటేననే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బిజెపి నిర్ణయించుకుంది.
అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల బిజెపి ఎమ్మెల్యేలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిలను అధిష్టానానికి నివేదించనున్నారు. వారు ఇచ్చిన రిపోర్టులపై నిన్న జరిగిన సమావేశంలో చర్చించారు.బిజెపి , బీఆర్ఎస్ ఒకటైననే నెగిటివ్ విమర్శలను తిప్పి కొట్టాలని నిర్ణయించారు.