బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss 7 ) మొదటి మూడు ఎపిసోడ్లు బాగానే ఉన్నా ఆ తర్వాత ఎపిసోడ్లు మాత్రం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాయి.ఈ వారం ఎలిమినేషన్ లేదని ప్రచారం జరిగినా కిరణ్ రాథోడ్ ను( Kiran Rathode ) బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
కిరణ్ రాథోడ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా లాభం లేదని ఈ షో నిర్వాహకులు భావించారని సమాచారం అందుతోంది.
కిరణ్ రాథోడ్ రెమ్యునరేషన్ వారానికి 2.75 లక్షల రూపాయలు కావడంతో ఆమెను ఎలిమినేట్ చేయడమే మంచిదని బిగ్ బాస్ షో నిర్వాహకులు ఫీలవుతున్నట్టు తెలుస్తోంది.అయితే మరోవైపు బిగ్ బాస్ షో సీజన్7 విన్నర్ రతికా రోజ్( Rathika Rose ) అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
బిగ్ బాస్ రతికకు ఫేవర్ గా ఉన్నాడంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లో ఏమీ చేయకపోయినా రతిక విన్నర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఇంప్రెస్ ది బిగ్ బాస్ టాస్క్ లో( Impress The Bigg Boss Task ) రతిక ఏం చేయకపోయినా విన్నర్ కావడంతో ఈ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రతిక ఏం చేయకపోయినా టాస్క్ లో విన్నర్ అయ్యారంటే బిగ్ బాస్ ఒక్కో కంటెస్టెంట్ విషయంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఈ కామెంట్ల విషయంలో ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.కష్టపడిన వాళ్ల కంటే కష్టపడని వాళ్లకే బిగ్ బాస్ షోలో ఎక్కువగా గుర్తింపు దక్కుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ షో సీజన్7 రేటింగ్స్ గురించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.బిగ్ బాస్ షో నెగిటివ్ కామెంట్ల గురించి నాగ్( Nagarjuna ) ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.