జాతీయ కుష్టు నిర్ములనలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కుష్టు వ్యాధి గుర్తింపు ఉద్యమం సందర్భంగా ఇంటింటి సర్వే తేదీ.16-08-23 నుండి 31-08-23 వరకు సర్వే నిర్వహించడం జరిగింది.ఇట్టి సర్వే ఆశా బృందాలతో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 485 మంది ఆశా బృందాలు పాల్గొనడం జరిగింది.అందరూ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.ఈ సర్వేలో 5,32,565 మందిని పరీక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా 854 మంది వ్యక్తులు అనుమానితులుగా గుర్తించం జరిగిందన్నారు.అందులో 8 మందిని గుర్తించి బహుళ ఔషధ చికిత్స అందించడం జరిగిందని తెలిపారు.
ఇంకా మిగిలిన అనుమానిత వ్యక్తులను త్వరలో పరీక్షించడం జరుగుతుంది.ప్రస్తుతం మన జిల్లాలో ప్రస్తుతం 16 మంది చికిత్స పొందుతున్నారు.కుష్టువ్యాధి లక్షణాలు ముఖ్యంగా చర్మం పై తెల్లని, ఎర్రని మచ్చలు స్పర్శ జ్ఞ్యానం (మొద్దు బారి) కోల్పోయి ఉంటాయి.ఈ మచ్చలు దేహంలో ఏ ప్రదేశంలోనైన రావచ్చు, పరిపెరల్ నరాల్లో నొప్పి, వాపు కలిగి ఉండటం ఈ వ్యాధి యొక్క లక్షణాలు.
కుష్టు వ్యాధి వంశపారంపర్యంగా రాదు.ఇది మైకోబాక్టీరియమ్ లెప్రే అనే సూక్ష్మ క్రిమి ద్వారా వస్తుంది.
ప్రారంభంలో చికిత్స తీసుకుంటే అంగవైకల్యం రాకుండా కాపాడు కోవచ్చు.ఈ వ్యాధిని బహుళ ఔషధ చికిత్స ద్వారా నయం చేస్తున్నాం.ఈ వ్యాధిలో 1 నుండి 5 మచ్చల వరకు పాసి బాసిల్లరి (పిబి ) మరియు 5 కంటే ఎక్కువ మచ్చలు మరియు నరాలలో నొప్పి కలిగి ఉంటే మల్టి బాసిల్లరి (ఎంబి ) చికిత్స ద్వారా నయమవుతుంది.ఇట్టి కార్యక్రమం జిల్లా వైద్యాధికారి డా.సుమన్ మోహన్ రావు , జిల్లా ప్రోగమ్ అధికారి డా.రజిత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని డిప్యూటీ ప్యారమెడికల్ ఆఫీసర్లు చేపూరి శ్రీనివాస్, రేవూరి కాశీనాథం, రెబెల్లి శ్రీనివాస స్వామి, కూన సురేష్ పర్యవేక్షించారు.ఈ వ్యాధికి చికిత్స ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా లభించును.