బన్నీ గొప్పదనం చెప్పిన పోసాని... ఐదు లక్షలు ఇచ్చారంటూ కామెంట్స్!

తెలుగు చిత్రపరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun )ఒకరు.అల్లు అరవింద్ ( Allu Aravind ) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈయన హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

 Posani Comments About Bunny, Posani Krishnamurali, Allu Arjun, Allu Aravind, Fil-TeluguStop.com

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందినటువంటి ఈయన పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.ఈ విధంగా పాన్ ఇండియా స్టార్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ ఏకంగా ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డును కూడా అందుకున్నారు.

Telugu Allu Aravind, Allu Arjun-Movie

ఈ విధంగా అల్లు అర్జున్ జాతీయ నటుడిగా అవార్డు( National Actor Award ) అందుకోవడంతో ఈయన పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది అదే విధంగా పలువురు సినిమా సెలబ్రిటీలు బన్నీతో వారికున్నటువంటి అనుబంధం గురించి కూడా గుర్తు చేసుకుంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ క్రమంలోని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి నటుడు పోసాని కృష్ణ మురళి( Posani Krishnamurali )తాజాగా అల్లు అర్జున్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Allu Aravind, Allu Arjun-Movie

ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ బన్నీ ఎంతో గొప్ప నటుడని అలాగే గొప్ప మనసున్న వ్యక్తి అని తెలిపారు.ఆయన ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేశారు.అయితే ఆ సహాయాలు చెప్పుకోవడానికి ఇష్టపడరని తెలిపారు.ఇక బన్నీ నాకు కూడా ఐదు లక్షల రూపాయలు సహాయం చేశారని పోసాని తెలిపారు.ఈ ఐదు లక్షలు తన చేతిలో పెట్టినటువంటి అల్లు అర్జున్ మీరు డబ్బును వృధా చేయరని నాకు తెలుసు.మీరు ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించారు.

అలాగే ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు.అందుకోసం వీటిని ఉపయోగించమని చెప్పి నాకు ఐదు లక్షలు ఇచ్చారని తెలిపారు.

ఆ ఐదు లక్షలతో నేను ముగ్గురు చిన్నారులను చదివించానని ఆ ముగ్గురితో లైవ్ లో అల్లు అర్జున్ తో మాట్లాడించి వారి చేత కృతజ్ఞతలు చెప్పించాను అంటూ పోసాని ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube