'కల్కి' సినిమాలో రాజమౌళి.. వైరల్ అవుతున్న సెన్సేషనల్ బజ్!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD( Kalki 2898-AD )పాన్ వరల్డ్ మూవీగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకుని సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

 Ss Rajamouli Is Playing A Key Role In Prabhas Kalki 2898-ad, Prabhas, Ss Rajamou-TeluguStop.com

ఇది పాన్ వరల్డ్ మూవీ కావడంతో ఈ సినిమా కోసం అన్ని ఇండస్ట్రీల స్టార్స్ ను నాగ్ అశ్విన్ తీసుకున్నారు.

ఇప్పటి వరకు ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్స్ భాగం అవ్వడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.ఇప్పటికే రిలీజ్ అయినా గ్లింప్స్ అందరిని ఆకట్టు కోవడమే కాకుండా ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు వెళ్లేలా చేసాయి.ఇదిలా ఉండగా ఇప్పుడొక సెన్సేషనల్ బజ్ నెట్టింట వైరల్ కాగా ఈ విషయంపై తెగ చర్చించు కుంటున్నారు.

మరి ఆ సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో కీలకమైన క్యామియో రోల్ లో దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) నటించ బోతున్నారట.ఇది కొన్ని క్షణాల పాటు ఉండే సన్నివేశం అని ఈ పాత్ర కోసం జక్కన్నను ఎంచుకున్నట్టు తెలుస్తుంది.ఇదే నిజమైతే ఈ సినిమా క్రేజ్ మరింత పెరగడం పక్కా అనే చెప్పాలి.ప్రభాస్ రాజమౌళి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్.ఇక ఇప్పుడు రాజమౌళి ప్రభాస్ సినిమాలో చిన్న రోల్ చేసిన ఆ క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి.రాజమౌళి కూడా ఈ రోల్ కోసం ఒప్పుకున్నట్టు చెబుతున్నారు.

చూడాలి ఇందులో ఎంత నిజం ఉందో.కాగా ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్( Aswani Dutt ) నిర్మిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube