2023 సంవత్సరం ఆగష్టు నెలలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి.అయితే ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు నిర్మాతలను ముంచేసి భారీ నష్టాలను మిగిల్చాయి.
కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచినా ఆ సినిమాలు తెలుగు సినిమాలు కాకపోవడం గమనార్హం.ఆగష్టు నెలలో విడుదలైన సినిమాలలో ఒకటైన జైలర్ మూవీ( Jailer ) 600 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించింది.
బాలీవుడ్ మూవీ గదర్2( Gadar 2 ) కూడా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లు సాధించింది.అయితే భోళా శంకర్, గాండీవదారి అర్జున సినిమాలు మాత్రం ఫ్లాప్ టాక్ తో నిర్మాతలను నిలువువా ముంచేశాయి.బెదురులంక 2012 మూవీ( Bedurulanka 2012 ) హిట్ టాక్ తెచ్చుకున్నా ఆ సినిమా మరీ భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం లేదు.ఉస్తాద్, కింగ్ ఆఫ్ కొత్త( King Of Kotha ), డ్రీమ్ గర్ల్ సినిమాలు థియేటర్లలో విడుదలై డిజాస్టర్ ఫలితాలను అందుకున్నాయి.
ఆగష్టు నెల తెలుగు సినిమాలన్నీ బాక్సాఫీస్ కు షాకివ్వడంతో సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానున్న ఆరు పాన్ ఇండియా సినిమాలపై ఇండస్ట్రీ ఆశలు పెట్టుకుంది.ఖుషి, జవాన్, స్కంద, చంద్రముఖి2, మార్క్ ఆంటోని, సలార్( Salaar ) సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాల బడ్జెట్ 1500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం అందుతోంది.ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్లను అందుకుంటాయో చూడాల్సి ఉంది.
ఈ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఆగష్టు నెలలో మొత్తం 25 సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలలో కొన్ని సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా సినీ అభిమానులకు తెలియదు.
మిస్టేక్, రాజుగారి కోడిఫులావ్, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, దిల్ సే, హెబ్బులి, బ్లడ్ అండ్ చాక్లెట్, ప్రియమైన ప్రియ, ఎల్.జీ.ఎమ్, భూతాల బంగ్లా, ప్రేమ్ కుమార్, జిలేబి, మదిలో మది, పిజ్జా3 సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా చాలామంది అభిమానులకు తెలియదు.