పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం జరిగింది.ఉత్తర 24 పరగణాలు జిల్లాలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
కాగా పేలుడు తీవ్రతకు మృతదేహాలు చెల్లాచెదురు కావడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.పేలుడు ధాటికి బాణసంచా తయారీ భవనం ధ్వంసం అయిందని తెలుస్తుంది.
ఈ బ్లాస్ట్ లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.