ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్లు అందరు కూడా ఒకప్పుడు చిరంజీవి( Chiranjeevi ) గారి అభిమానులే కావడం వల్ల ఇపుడు అందరి లక్ష్యం ఒకటే చిరంజీవి తో సినిమా చేయడం.ఆయన తో ఒక సినిమా చేస్తే చాలు డైరెక్టర్లు గా మనం ఎంచుకున్న ఫీల్డ్ లో మనం వంద శాతం సక్సెస్ అయినట్టే అని చాలా మంది డైరెక్టర్లు అనుకుంటున్నారు… ఇక ఇప్పటికే ఆయన తో సినిమా చేసే లిస్ట్ లో హరీష్ శంకర్, వెంకీ కుడుముల,అనిల్ రావిపూడి,కళ్యాణ్ కృష్ణ లాంటి డైరెక్టర్లు ఉన్నప్పటికి కొత్త గా మరో డైరెక్టర్ కూడా చిరంజీవి తో సినిమా చేయడమే నా డ్రీమ్ అంటూ ముందుకు వచ్చాడు ఆయనే కార్తికేయ 2( Karthikeya 2 ) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చందు మొండేటి… ఈయన కూడా ఎప్పటికైనా చిరంజీవి తో ఒక సినిమా చేసి నన్ను నేను మరోసారి నిరూపించు కుంటాను అని చెప్తున్నాడు…
ఈయన ప్రస్తుతం నాగ చైతన్యతో ఒక సినిమా చేస్తున్నాడు నిజానికి ఈయన సినిమాలు అన్ని కూడా చాలా బాగుంటాయి.అయితే ఈయన ఇప్పటికే చిరంజీవి తో ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అని అనుకొని ఆయనని ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా చూపించని విధం గా చాలా కొత్తగా ఉండే విధంగా ఒక కథ కూడా రాసుకున్నడట…అలాగే చాలా కొత్త గా ఈ సినిమా లో చూపిస్తా అని అంటున్నాడు అయితే ఈ డైరక్టర్ల అందరిని దాటుకొని ఆయనకి సినిమా రావాలంటే ఇంకా చాలా కాలం పడుతుంది అంటూ మరి కొందరు వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…
అయితే చిరంజీవి తో సినిమా అంటే ఏ డైరెక్టర్ మాత్రం చేయను అంటాడు చిరంజీవి తో సినిమా చేస్తే ఆ డైరెక్టర్ కు ఉన్న ఇమేజ్ మారి పోవడం తో పాటు వాళ్ళు ఇంకా చాలా విషయాలను కూడా నేర్చుకోవచ్చు అంటూ చెప్తున్నారు అందుకే చిరంజీవి అంటే ఇండస్ట్రీ లో అంత క్రేజ్… ఏ స్టార్ హీరో కి కూడా లేని విధంగా ఇప్పటికీ చిరంజీవి గారితో సినిమా చేయడానికి యంగ్ డైరెక్టర్లు ఉత్సాహం చూపిస్తున్నారు అంటే ఆయనకు ఉన్న క్రేజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక ఇప్పటికే వశిష్ట తో ఒక సినిమా చేస్తున్నాడు చిరంజీవి…