అసలే పెళ్లిళ్ల సీజన్.ఇలాంటి సమయంలో పీరియడ్స్ వస్తే చేసుకున్న ప్లాన్స్ అన్ని కొలాప్స్ అవుతాయి.
అందుకే పెళ్లిళ్లు, ఫంక్షన్స్, పూజలు తదితర కార్యక్రమాలు ఉన్నప్పుడు కొందరు మహిళలు పీరియడ్స్ ను పోస్ట్ ఫోన్ చేయాలని అనుకుంటూ ఉంటారు.ఈ నేపథ్యంలోనే మందులు వాడతారు.
అయితే కొన్ని కొన్ని సహజ చిట్కాలు ద్వారా కూడా పీరియడ్స్ ను పోస్ట్ పోన్ చేయవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం పీరియడ్స్ ను పోస్ట్ పోన్ చేసే ఆ జ్యూస్ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా నాలుగు ఉసిరికాయలను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన ఉసిరికాయలు( Amla ) గింజ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక క్యారెట్ ( Carrot )ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఉసిరికాయ ముక్కలు, క్యారెట్ ముక్కలతో పాటు ఒక కప్పు ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్( Orange juice ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని నేరుగా సేవించాలి.
నెలసరి సమయానికి వారం రోజుల ముందు నుంచి ఈ జ్యూస్ ను నిత్యం తీసుకోవాలి.ఈ జ్యూస్ శరీరంలో అధిక వేడిని తొలగిస్తుంది.
బాడీని కూల్ గా మారుస్తుంది.దాంతో పీరియడ్స్ పోస్ట్ పోన్ అవుతాయి.
ఈ జ్యూస్ ను తాగడంతో పాటు వేడి చేసే ఆహారాలకు దూరంగా ఉండండి.మసాలా, స్పైసెస్ తీసుకోవడం తగ్గించండి.ఒత్తిడికి దూరంగా ఉండండి.నిత్యం వ్యాయామాలను చేయండి.మరియు నిమ్మరసం( Lemon Juice ) కూడా పీరియడ్స్ ను ఆలస్యం చేస్తుంది.ఒక నిమ్మ పండు లోని రసంతో పాటు గింజలను కూడా తీసుకుని వాటర్ లో మిక్స్ చేసి తీసుకోవాలి.
తద్వారా మంచి ఫలితం ఉంటుంది.