అనుష్క లాంటి స్టార్ తో నటించాలంటే భయమేసింది: నవీన్ పోలిశెట్టి

జాతి రత్నాలు( Jathi Ratnalu ) సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అందుకున్నటువంటి నటుడు నవీన్ పోలీ శెట్టి ( Naveen Polishetty )సెప్టెంబర్ 7వ తేదీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి( Miss Shetty Mister Polishetty ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.మహేష్ బాబు పి దర్శకత్వంలో యు వి క్రియేషన్ బ్యానర్ లో ఈ సినిమాలో అనుష్క( Anushka ) నటించిన సంగతి మనకు తెలిసిందే.

 Naveen Polishetty Learn Hug Anushka Shetty , Naveen Polishetty, Anushka, Miss Sh-TeluguStop.com

ఇలా నవీన్ పోలీశెట్టి అనుష్క కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానున్నటువంటి తరుణంలో నవీన్ పోలీస్ శెట్టి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన అనుష్క గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

Telugu Anushka, Hugs, Shettymister-Movie

ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఈ సినిమాలో అనుష్క శెట్టితో కలిసి నటించాలి అన్నప్పుడు తనకు కాస్త భయం వేసిందని తెలిపారు.ఆమె ఒక స్టార్ హీరోయిన్ అలాంటి ఆమెతో కలిసి నటించాలంటే రెండు రోజుల పాటు చాలా కంగారు పడ్డానని తెలిపారు.అయితే అనుష్క తనను బాగా ఎంకరేజ్ చేయడంతో నటించడానికి చాలా ఈజీగా మారిపోయిందని ఈ సినిమాతో అనుష్క తనకు మంచి ఫ్రెండ్ అయిందని నవీన్ తెలిపారు.ఈ సినిమా షూటింగ్ మొత్తం చాలా సరదాగా సాగిందని తెలిపారు.

ఇక ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని తెలిపారు.

Telugu Anushka, Hugs, Shettymister-Movie

ఇకపోతే యాంకర్ నవీన్ పోలీ శెట్టిని ప్రశ్నిస్తూ మీరు అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ తో కలిసి నటించారు తన దగ్గర నుంచి ఏదైనా నేర్చుకున్నారా అంటూ ఈయనని ప్రశ్నించగా తన వద్ద నుంచి నేను కౌగిలింతలు ( Hugs ) నేర్చుకున్నాను అంటూ కామెంట్స్ చేశారు.ఆమె సెట్ లోకి అడుగు పెట్టగానే అందరికీ ఎంతో అభిమాన పూర్వకంగా హగ్ ఇస్తారు.నేను కూడా అనుష్క దగ్గర నుంచి ఈ విషయాన్ని నేర్చుకున్నాను అంటూ అనుష్క గురించి నవీన్ పోలిశెట్టి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube