పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కుమారుడు అఖీరా నందన్ ( Akira Nandan ) ఫోటో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు అఖీరానందన్ అలాగే తన మనవడు కార్తికేయతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వీరిద్దరూ యుఎస్ లో ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు.ఈ విధంగా పవన్ కళ్యాణ్ కుమారుడి ఫోటోలను ఇలా చూడటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
అయితే ఈ పోస్ట్ చేసిన వెంటనే రాఘవేంద్రరావు డిలీట్ చేశారు.
ఈ ఫోటో డిలీట్ చేసినప్పటికీ ఈయన ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్నారని చెప్పడంతో త్వరలోనే ఆఖీరానందన్ సినిమాలలోకి రాబోతున్నారు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.అయితే ఈ ఆనందం కొంతసేపు కూడా అభిమానులలో లేకుండా అభిమానుల ఆనందం పై రేణు దేశాయ్ (Renudesai) నీళ్లు చల్లారనీ చెప్పాలి.ఈ విధంగా ఈ ఫోటోని డిలీట్ చేయడం పట్ల రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అఖీరానందన్ సినీ ఎంట్రీ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రేణు దేశాయ్ సోషల్ మీడియా( Social media ) వేదికగా స్పందిస్తూ ప్రస్తుతానికైతే అకిరా నందన్ కు సినిమాలలోకి రావాలని ఏమాత్రం ఆసక్తి లేదు.భవిష్యత్తులో తన నిర్ణయం ఎలా ఉంటుందో నేను చెప్పలేను.ఇలా ఏదైనా ఒక పోస్ట్ చేస్తే దాని గురించి ఊహించుకోవడం ఆపేయండి.ఒకవేళ ఆకీర సినిమాలలోకి రావాలని నిర్ణయం తీసుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే మీ అందరితో పంచుకుంటాను అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
త్వరలోనే తమ అభిమాన హీరో వారసుడిని తెరపై చూడబోతున్నామని సంతోషపడేలోపే రేణు దేశాయ్ మాత్రం తన కొడుకు సినీ ఎంట్రీ గురించి షాకింగ్ పోస్ట్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.