ఎప్పుడైతే స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) అక్కినేని ఫ్యామిలీని వదులుకుందో అప్పటినుంచి తనను అభిమానించే వాళ్ళు తక్కువై విమర్శించే వాళ్ళు ఎక్కువయ్యారు.ఎవరి సపోర్టు లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టి అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
కారణం తనలో ఉన్న టాలెంట్, అందం అలాంటిది కాబట్టి.స్టార్ హీరోలు సైతం సమంతతో సినిమా చేయటానికి ముందుకు వచ్చేవారు.
అలా సమంత ఒక స్టార్ హోదాలో ఉండగా నాగచైతన్యను( Naga Chaitanya ) కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రేమ వివాహం జరుపుకుంది.పెళ్లి తర్వాత సమంతకు మరింత గౌరవం పెరిగింది.
అటు అక్కినేని ఫ్యామిలీ కోడలని, స్టార్ హీరోయిన్ అని చాలామంది తనకు మంచి రెస్పెక్ట్ ఇచ్చారు.అంతేకాకుండా సొంతంగా కొన్ని బిజినెస్ లు కూడా నడిపించింది సమంత.
ఇక ఆ సమయంలో అందరి దృష్టిలో పడి ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.నాగచైతన్య సపోర్టుతో పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేసింది.అంతేకాదు రొమాంటిక్ సీన్లలో కూడా నటించింది.ఇక ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ కూడా ఉండేది.కానీ ఏం జరిగిందో తెలియదు మూడేళ్లకే వీరిద్దరూ విడిపోయారు.వారి విడాకులకు కారణం ఇప్పటికీ అది రహస్యంగానే ఉంది.
కానీ చాలామంది సమంత విషయంలోనే తప్పు పట్టారు.తన వైపే తప్పు ఉంది అని విమర్శించారు.ఆ సమయంలో చాలా విమర్శలు ఎదుర్కొంది సమంత.బాగా ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా ద్వారా అందరికీ టచ్ అయ్యే కొటేషన్స్ పంచుకుంది.
ఇక మెల్లిమెల్లిగా అన్ని మర్చిపోయి తన కెరీర్ పరంగా బిజీగా మారింది.వచ్చిన అవకాశాలను వదులుకోకుండా సైన్ చేసి నటించింది.
కానీ పెళ్ళికి ముందు వచ్చినంత సక్సెస్ అందుకోలేకపోతుంది.
ఆమె నటించిన శాకుంతలం మూవీ ( Shaakuntalam )కూడా డిజాస్టర్ అయింది.పైగా తనకు మయోసైటిస్ అని అరుదైన వ్యాధి కూడా వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుతం ఆమె ఆశలన్నీ విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఖుషి( Kushi ) పైన ఉన్నాయని చెప్పాలి.
ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే సినిమాకు సంబంధించిన సాంగ్స్, సినిమా ఈవెంట్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.రీసెంట్ గా ఈ సినిమా ఈవెంట్ ఫంక్షన్ లో సమంత, విజయ్ దేవరకొండ చేసిన ఓవర్ మామూలుగా లేదని చెప్పాలి.ప్రతి ఒక్కరు వీరి ప్రవర్తన పై ఫైర్ అయ్యారు.
ఇక సమంత ఒక ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకొని ఆరోగ్యపరంగా రెస్ట్ తీసుకుంటుంది అని వార్తలు కూడా వచ్చాయి.
అయితే ఇదంతా పక్కన పెడితే సమంత ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్న సంగతి తెలిసిందే.ఇక అక్కడ దిగుతున్న ఫోటోలు బాగా పంచుకుంటూ ఉంది.తాజాగా తను ఒక ఈవెంట్ సందర్భంగా బ్లాక్ చీర కట్టుకొని కొన్ని ఫోటోలు దిగింది.
రకరకాల ఫోజులతో కనిపించింది.అయితే చీర పైటా జరిపి ఎద అందాలు చూపించింది.
ఇక ఆ ఫోటోలు చూసి సమంతను మరింత విమర్శిస్తున్నారు జనాలు.ఒక నెటిజన్.
నాగచైతన్యని విడిపోయిన తర్వాత చాలా వేషాలు వేస్తుందని కామెంట్ చేశారు.మరొకరు నీకు ఏమీ బాలేదు అని బయట టాక్.
నువ్వేమో ఏదో స్టైల్ గా తయారై ఫొటోస్ పెడుతున్నావు అంటూ ట్రోల్ చేశారు.