మామూలుగా ఒకప్పటి తరానికి చెందిన వాళ్లకు వాళ్ల సమయంలో వచ్చిన పాటలు వారికి నచ్చుతూ ఉంటాయి.ఇప్పుడున్న ప్రేక్షకులకు ఈ సమయంలో వచ్చిన పాటలు నచ్చుతూ ఉంటాయి.
కానీ ఇప్పుడున్నవారు అప్పటి పాటలు వినటానికి అంత ఆసక్తి చూపించరు.అప్పటి తరం వాళ్ళు ఇప్పటి పాటలు వింటుంటే చాలా చిరాకు పడుతూ ఉంటారు.
కానీ ఒకప్పటి తరానికి చెందిన సుధా మూర్తి( Sudha Murthy ) ఈ తరంకు చెందిన ఒక పాట చాలా ఇష్టమని చెప్పటమే కాకుండా ఆ పాటను పాడుతూ అందరినీ కాస్త ఆశ్చర్యపరిచింది కూడా.ఇంతకు ఆ పాట ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామందికి.ఇన్ఫోసిస్ సహవ్యహ స్థాపకుడు నారాయణమూర్తి( Narayanamurthy ) పరిచయం ఉండవచ్చని చెప్పాలి.ముఖ్యంగా ఆయన సతీమణి సుధా మూర్తి కూడా అందరికీ బాగా పరిచయం అని చెప్పాలి.ఆమె తరచుగా వార్తలలో హైలెట్ అవుతూ ఉంటుంది.ఇక ఆమె మాట్లాడే మాటలు కూడా అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి.అప్పుడప్పుడు మంచి విషయాలు కూడా చెబుతూ ఉంటుంది.
గతంలో తను వెజ్.నాన్ వెజ్ స్పూన్ అంటూ చేసిన వ్యాఖ్యలు మాత్రం బాగా హాట్ టాపిక్ గా నిలిచాయి.
అయితే ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా తను ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో కొన్ని విషయాలు పంచుకుంది.అయితే యాంకర్ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అని అడగటంతో.తనకు తెలుగులో ఒక సాంగ్ ఇష్టమని.ప్రభాస్, అనుష్క శెట్టి ( Prabhas, Anushka Shetty )కలిసి నటించిన మిర్చి మూవీలోని ఇదేదో బాగుంది సాంగ్ తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
ఆ పాట చాలా బాగుంటుంది అని తెలిపింది.అంతేకాకుండా ఆ పాటను పాడుతూ ఆ పాటకు ఎంజాయ్ చేస్తూ కనిపించింది.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.