సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. జైలర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 95 కోట్ల రూపాయలు అంటే రజనీకాంత్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో మార్కెట్ ఉందో సులభంగానే అర్థమవుతుంది.
రజనీకాంత్ జైలర్ సినిమాతో సులువుగా 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. రజనీకాంత్ ( Rajanikanth )కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
రజనీకాంత్ మొత్తం ఆస్తుల విలువ 430 కోట్ల రూపాయలుగా ఉందని తెలుస్తోంది.ఇతర భాషల్లో కూడా క్రేజ్ ను సంపాదించుకున్న రజనీకాంత్ కు ఖరీదైన విల్లాలతో పాటు లగ్జరి కార్లు సైతం ఉన్నాయి.
అధ్యాత్మికత ఎక్కువగా ఉన్న అతికొద్ది మంది హీరోలలో రజనీకాంత్ ఒకరు కావడం గమనార్హం.రజనీకాంత్ జైలర్ సినిమా సక్సెస్ తో ఫామ్ లోకి రావడంతో భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఒక్కో సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్న రజనీకాంత్ తన సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోతే రెమ్యునరేషన్ ను వెనక్కు ఇచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి.రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Dilipkumar ) కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు వస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటున్న రజనీని సైతం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
కథలకు అనుగుణంగా లుక్స్ ను మార్చుకుంటున్న రజనీ గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రజనీకాంత్ కు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.రజనీకాంత్ కొత్త సినిమా లాల్ సలామ్ పై కూడా అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.
రజనీకి క్రేజ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.