జ్యోతిష్య శాస్త్రం( Astrologers ) ప్రకారం 9 గ్రహాలు ప్రజల పై ఎక్కువగా ప్రభావం చూపుతాయి.గ్రహాల దుష్ప్రభావాలను తగ్గించడానికి లేదా గ్రహాన్ని బలోపేతం చేయడానికి చాలా సార్లు ప్రజలు ఆ గ్రహానికి సంబంధించిన కొన్ని రకాల రత్నాలను ధరిస్తూ ఉంటారు.
అయితే జ్యోతిష్య నిపుణుల ప్రకారం రత్నాలు ధరించేవారు కొందరు మాత్రమే ఉన్నారు.మీరు జాతకం చూపకుండా రత్నం ధరిస్తే దానివల్ల మంచి ఫలితాలకు బదులు సైడ్ ఎఫెక్ట్స్ ( Side effects )వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
దీని వల్ల తీవ్రమైన నష్టాలు కలగవచ్చు.జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం రత్నాలు చాలా శక్తివంతమైనవి.అవి ఒక వ్యక్తిని చాలా ఎత్తుకు తీసుకెళ్లగలవు.అలాగే ఎత్తు నుంచి పడిపోయేలా చేయగలవు.అంతేకాకుండా రత్నాన్ని సరిగ్గా పరీక్షించి పద్ధతిగా ధరిస్తే వ్యక్తి జీవితంలో, వృత్తిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.రాయిని ధరించే ముందు మీ జీవిత జాతకాన్ని లేదా చేతి రేఖలను చూపించుకోవాలి.
ముఖ్యంగా చెప్పాలంటే గ్రహాలు వాటి రత్నాల సమాచారం చాలా ముఖ్యమైనది.సూర్యుడికి మాణిక్యం, శనికి నీలమణి, బుధుడికి పచ్చ, బృహస్పతికి పుష్పరాగము, శుక్రుడికి వజ్రం,( Diamond for Venus ) రాహువుకు గోమేదికం, అంగారక గ్రహానికి పగడం, చంద్రునికి తెల్లని ముత్యం ఉంటాయి.
అంతేకాకుండా రత్నాల బరువు కూడా ఎంతో ముఖ్యం.చాలాసార్లు తక్కువ బరువున్న రత్నాన్ని ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు.
ఇంకా చెప్పాలంటే ఏడున్నర రాయిని ఎప్పుడూ ధరించకూడదని నిపుణులు చెబుతున్నారు.ఏడున్నర పదం శని తో ముడి పడి ఉంటుంది.కాబట్టి అలాంటి రత్నాన్ని ధరించడం మంచిది కాదని చెబుతున్నారు.అంతేకాకుండా ఏదైనా దాన్ని ధరించే ముందు అది ఏ లోహంతో అనుకూలంగా ఉందో కూడా చూసుకోవాలి.మాణిక్యం వంటి రత్నాలలో ఎప్పుడూ రాగినీ ధరించాలి.పచ్చ లేదా ముత్యాన్ని వెండి, పుష్పరాగము, పగడము, వజ్రం, బంగారంతో మాత్రమే తయారు చేసి ధరించాలి.
నీలమణి విషయానికి వస్తే దానిని బంగారం, వెండి లేదా పంచధాతుల్లో మాత్రమే ధరించాలి.రత్నాన్ని కొనేటప్పుడు తప్పనిసరిగా సర్టిఫికెట్ తీసుకోవడం మర్చిపోకూడదు.
DEVOTIONAL