Nandi Awards, : నంది అవార్డులపై వాణిజ్య మండలి కీలక ప్రకటన.. ఏపీకి మాత్రమే పేటెంట్ ఉందంటూ?

తాజాగా నంది అవార్డులపై ( Nandi Awards )తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఒక కీలక ప్రకటన చేసింది.కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 24న దుబాయ్‌లో జరిగే నంది అవార్డ్‌ వేడుకకు ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఎలాంటి సంబంధం లేదు అని తెలిపింది.

 Tfcc Nandi Awards Only Andhra Pradesh Has The Patent On Those Nandi Awards Says-TeluguStop.com

దుబాయ్‌లో జరిగే నంది అవార్డుల వేడుక రామకృష్ణ గౌడ్‌ వ్యక్తిగతమని వెల్లడించింది.తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి ఏపీ స్టేట్ ఫిల్మ్‌ డెవలపమెంట్‌ కార్పొరేషన్‌ ల వద్ద టీఎఫీసీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని అన్నారు.

అలాగే ఆ ఈవెంట్‌కు సంబందించి ఎటువంటి సమాచారం లేదని తాజాగా ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు.

Telugu Ap, Nandi Awards, Telanganatelugu-Movie

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీకి మాతృసంస్థ, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ , తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాత్రమే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల గుర్తించబడిన సంస్థలు అని మరోసారి తెలియజేస్తున్నట్టు తెలిపారు.ఈ సందర్భంగా వాణిజ్యమండలి ఈ విషయంపై స్పందిస్తూ.ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా.24-09-2023న దుబాయ్‌లో నిర్వహించే టీఎఫ్‌సీసీ నంది అవార్డుల గురించి పైన తెలియచేసిన రెండు ఛాంబర్‌లకు ఎలాంటి సంబంధం లేదు.ఈ ఈవెంట్‌లో మేం భాగం వహించము.

ఇది తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ పి.రామకృష్ణ గౌడ్‌ నిర్వహించే వ్యక్తిగత ప్రైవేట్‌ ఈవెంట్‌.

Telugu Ap, Nandi Awards, Telanganatelugu-Movie

ఇది తెలంగాణ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఛాంబర్‌ కాదు.నంది అవార్డు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేటెంట్‌ అయినందున, నంది అనే పేరును ఉపయోగించడం, అవార్డు వేడుక నిర్వహించడాన్ని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖండిస్తున్నామని అన్నారు.ఏపీ సినిమాటో గ్రఫీ మంత్రిత్వ శాఖ, తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ల వద్ద టీఎఫ్‌సీసీ నంది అవార్డుల ఈవెంట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని అందరికీ తెలియజేస్తున్నాం అంటూ తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గౌరవ కార్యదర్శి కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి కె.అనుపమ్‌ రెడ్డి ప్రకటనలో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube