సర్వేల రిపోర్టే ఫైనల్.. టికెట్లు వారికే ?

తెలంగాణలో రోజురోజుకూ పోలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది.ఎందుకంటే మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగుతుండడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాయి.

 Telangana Congress Party To Allot Tickets As Per Survey Reports Details, Telanga-TeluguStop.com

ఇప్పటికే అభ్యర్థుల విషయంలో అధికార బి‌ఆర్‌ఎస్( BRS ) మరియు కాంగ్రెస్ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మద్యనే తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉండడంతో.

గెలుపు గుర్రాల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి ఈ రెండు పార్టీలు.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి( Congress ) ఈసారి ఎన్నికలు ఎంతో కీలకం ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అయినప్పటికి తెచ్చింది కే‌సి‌ఆర్( KCR ) అనే సెంటిమెంట్ తో క్రెడిట్ అంతా బి‌ఆర్‌ఎస్ ( అప్పటి టి‌ఆర్‌ఎస్ ) ఖాతాలోకి వెళ్లిపోయింది.

Telugu Cm Kcr, Congress, Telangana-Politics

దీంతో కాంగ్రెస్ పార్టీ కేవలం నామమాత్రంగానే రాష్ట్రంలో కొనసాగుతూ వస్తోంది.ఇక 2018 ఎన్నికల్లో కూడా హస్తం పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు.ఆ తరువాత రేవంత్ రెడ్డి( Revanth Reddy ) టీపీసీసీ చీఫ్ పదవి చేపట్టడం పార్టీలో సీనియర్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం వంటి పరిణామాలతో హస్తం పార్టీ మరింత బలహీన పడుతూ వచ్చింది.ఇక కాంగ్రెస్ పనైపోయిందనుకునే సమయంలో కర్నాటక ఎన్నికల్లో సంచలన విజయం సాధించడం ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఆ ఎన్నికల్లో లభించిన విక్టరీ టి కాంగ్రెస్ లో కూడా కొత్త ఊపు తీసుకొచ్చింది.

Telugu Cm Kcr, Congress, Telangana-Politics

నేతలంతా ఒకే తాటిపైకి వచ్చి గెలుపు కోసం ముందడుగు వేస్తున్నారు.ఇక ఇతర పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున చేరికలను ఆహ్వానిస్తున్నారు.దీంతో మెల్లగా హస్తం పార్టీ తెలంగాణలో పుంజుకుంటోంది.

కాగా ఇతర పార్టీల నుంచి టికెట్ల ఆశతో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతుండడంతో టికెట్ల విషయంలో ముందుగానే కీలక సూచనలు చేస్తున్నారు హస్తం నేతలు.సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని.

టికెట్లపై ఎవరు పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని.సర్వేలలో ప్రజామద్దతు మెరుగ్గా ఉన్నవారికే అధిష్టానం టికెట్లను ఫైనల్ చేస్తుందని టి కాంగ్రెస్ ముఖ్య నేతలు చెబుతున్నారు.

దీంతో టికెట్ ఆశతో పార్టీలో చేరుతున్న వారికి బంగపాటు తప్పెలా లేదు.మరి హస్తం పార్టీ ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube