పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) సాయి ధరంతేజ్( Sai Dharam Tej ) కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బ్రో( Bro ) .ఈ సినిమా నేడు థియేటర్లలో ప్రదర్శితమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంది.
అయితే ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది.ఇక ఈ సినిమాలో సాయి ధరంతేజ్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉండడంతో అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.
తమిళం వినోదయ సీతం సినిమాకు రీమిక్స్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించారు.ఇక ఈ సినిమాకు డైలాగ్స్ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) అందించిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా నేడు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సముద్రఖని( Samuthirakani )ఈ సినిమా గురించి అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా ఫస్ట్ కాపీ పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని చూశారని ఈయన తెలిపారు.
అయితే ఈ సినిమా ఫస్ట్ కాపీ చూడటం కోసం త్రివిక్రమ్ ను ఆహ్వానించగా ఆయన ఈ సినిమాలో ఏం జరగబోతుందో నాకు తెలుసు ఎందుకంటే డైలాగ్స్ అని నేను రాశాను కాబట్టి ఈ సినిమా మొత్తం నాకు తెలుసు అని తెలిపారు.కానీ ఈ సినిమా చూసినప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకొని నా చేతిని గట్టిగా పట్టుకున్నారు.అలా ఆయన నా చేతిని పట్టుకోగానే మన పనిని మనం కరెక్ట్ చేసామని ఆ క్షణం అనిపించింది అంటూ ఈ సందర్భంగా సముద్రఖని త్రివిక్రమ్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.టాక్ పరంగా హిట్ సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.