టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే పాపులర్ అయిన హీరోలలో విశ్వక్ సేన్( Vishwak Sen ) ఒకరు.భాషతో సంబంధం లేకుండా విశ్వక్ సేన్ కు క్రేజ్, పాపులారిటీ పెరుగుతోంది.
అయితే వేర్వేరు కారణాల వల్ల విశ్వక్ సేన్ బేబీ సినిమాను( Baby Movie ) రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటివరకు బేబీ మూవీ గురించి పరోక్షంగా కామెంట్లు చేసిన విశ్వక్ తాజాగా ఈ సినిమా గురించి డైరెక్ట్ గా కామెంట్లు చేయడం గమనార్హం.
పేకమేడలు( Pekamedalu ) అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై న విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎవరి స్థాయిని బట్టి వాళ్లు బిజీగా ఉంటామని ఎలాంటి సినిమాలు చేయాలో క్లారిటీ ఉన్న సమయంలో ఎదుటివాళ్ల సమయాన్ని వృథా చేయకూడదని భావిస్తామని అందుకే కలవలేమని కథ వినలేమని చెబుతుంటామని విశ్వక్ సేన్ అన్నారు.
అయితే అలా చెప్పినా కొంతమంది ఫీలవుతుంటారని ఆయన కామెంట్లు చేశారు.
ఈ విషయంలో తానేం చేయలేనని అందరినీ సంతోషపెట్టడానికి తానేం బిర్యానీ కాదని విశ్వక్ సేన్ అన్నారు.సినిమా విజయం సాధిస్తే తలెత్తుకోవడంలో ఎలాంటి తప్పు లేదని కానీ కించపరచొద్దని ఇది మాత్రమే నాకు బాధను కలిగిస్తోందని ఆయన తెలిపారు.చిన్న సినిమా సక్సెస్ సాధించడం ఆనందించే విషయమని వాళ్లకు నా శుభాకాంక్షలు కూడా చెప్పానని విశ్వక్ సేన్ అన్నారు.
సినిమా బాగుందని దర్శకుల గ్రూప్ లో నేనే మెసేజ్ చేశానని అయితే దర్శకుడిని కలవలేదని మీమ్స్ వచ్చాయని విశ్వక్ సేన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.గంటసేపు చర్చించి నో చెప్పడంతో పోలిస్తే ముందే నో చెప్పడం బెటర్ అని భావించి నో చెప్పడం జరిగిందని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.విశ్వక్ సేన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.