Urfi Javed : ఎయిర్ పోర్ట్ లో ఉర్ఫీ జావెద్ పై మండిపడిన అంకుల్.. ఇండియా పరువు తీయకంటూ?

బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫి జావేద్( Urfi Javed ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లకు ఈమె బాగా సుపరిచితమే.

 A Middle Aged Man Publicly Lashes Out At Urfi Javed On Her Bold Outfits-TeluguStop.com

ఈమె నిత్యం తన హాట్ ఫోటో షూట్ లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఈమె విచిత్రమైన ఫ్యాషన్ సెన్స్ తో వార్తల్లో నిలుస్తూ ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది.

ఎక్కువగా ఈమె చిత్రవిచిత్ర వేషధారణతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఉర్ఫీ జావెద్‌.ఈ క్రమంలోనే అప్పుడప్పుడు తన వస్త్ర ధారణ విషయంలో దారుణమైన కామెంట్ లను ట్రోలింగ్స్ ని కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.

అయితే ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసినా ఊర్ఫీ జావిద్ ఆ విషయాలపై స్పందించకపోగా తన లైఫ్ తనదే అన్న విధంగా వ్యవహరిస్తూ వెళ్తూ ఉంటుంది.తన వెరైటీ డ్రెస్సులతో( variety dresses ) సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారిన ఉర్ఫీ డిఫరెంట్‌ ఫ్యాషన్‌ వేర్‌తో ఎన్నోసార్లు ట్రోల్స్‌ బారిన పడిన విషయం మనందరికి తెలిసిందే.ఇక ఆమె విచిత్రమైన వస్త్రధారణను చూసి తిట్టని వారు ఉండరు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఎయిర్ పోర్ట్( Airport ) లో చేదు అనుభవం ఎదురయింది.

ఇటీవలే ఆమె విమానంలో గోవా వెళ్తుండగా మద్యం సేవించి ఉన్న కొంత మంది యువకులు ఆమెను వేధించారు.

ఇక ఈరోజు ఆమె గోవా నుంచి ముంబైకి తిరిగి రాగా ఎయిర్‌పోర్టులో ఆమెకు మరో చేదు అనుభవం ఎదురైంది.ఎయిర్‌ పోర్టు నుంచి బయటికి వస్తున్న ఉర్ఫీని చూసిన ఒక నడివయసు వ్యక్తి ఆమె వేసుకున్న డ్రెస్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ఇలాంటి బట్టలు వేసుకుని ఇండియాలో తిరగడానికి అనుమతి లేదంటూ సదరు వ్యక్తి ఉర్ఫీ జావేద్‌తో అన్నాడు.

ఇలాంటి బట్టలు వేసుకుని ఇండియా పరువు తీయొద్దంటూ వ్యాఖ్యానించాడు.దీంతో కోపం తెచ్చుకున్న ఉర్ఫీ.

ఇదేమైనా నీ బాబుదా? మీ బాబు వల్ల ఏమైనా జరిగిందా? మీ బాబే ఏమీ చేయలేకపోయాడు కదా? నువ్వు వెళ్లి నీ పని చూసుకో అంటూ అతనిపై మండిపడింది.ఆ అంకుల్ మాత్రం ఆగలేదు.

ఇది తప్పు.మన వల్ల ఇండియా పేరు పాడవుతుంది అని ఆ వ్యక్తి స్పందించాడు.

దీంతో ఉర్ఫీకి మరింత మండిపోయింది.కోపంగా ఆ వ్యక్తి మీదికి వెళ్లిన ఉర్ఫీ.

అంకుల్ నీ పని చూసుకో అంటూ అతడిని బేవకూఫ్ అని తిట్టింది.అయితే, ఈ గొడవ అంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీంతో ఇప్పటికే ఉర్ఫీ మీద మంట మీద ఉన్న కొందరు నెటిజన్స్ అంకుల్ కడిగేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

అసలు వయసులో తనకన్నా పెద్ద అయిన వ్యక్తితో ఉర్ఫీ అలా మాట్లాడటం తప్పు అని కొందరు తప్పు బడుతున్నారు.అంకుల్‌కి హ్యాట్సాఫ్ అని అంతమంది ఉన్నా ఒక్కడే ధైర్యంగా ఆమెను మొహం మీద పశ్నించాడని ఒక నెటిజన్ పొగడ్తలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube