బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది.అతి వేగంతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.మరో 35 మంది గాయపడ్డారని తెలుస్తోంది.
మృతుల్లో ముగ్గురు చిన్నారులతో పాటు ఎనిమిది మంది మహిళలు ఉన్నారు.సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
బండారీయా నుంచి బారీషం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.