ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ”బ్రో ది అవతార్”..
ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసం మేకర్స్ కూడా వరుసగా అప్డేట్ లను అందిస్తున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Pawan Kalyan ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో’‘( Bro mvie ) పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జస్ట్ గెస్ట్ రోల్ లో నటించినప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ సైతం మంచి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

మొదట్లో ఇది రీమేక్ సినిమా అని ఫ్యాన్స్ కూడా గుర్రుగా ఉన్నారు.అంత హైప్ లేకుండా ఉంది.కానీ ఇప్పుడు కావాల్సినంత హైప్ వచ్చింది.వినోదయ సీతం రీమేక్ అయినప్పటికీ ఇప్పుడు భారీ క్రేజ్ పెరిగింది.ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగేలా చేసాయి.ఇంకా పవర్ స్టార్ లుక్ కూడా అందరిని ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేయనున్నారు.ఇది మరికొద్ది గంటల్లోనే మెగా ఫ్యాన్స్ ఫ్యాన్స్ ను అలరించడానికి రాబోతుంది.మరి ఒక డైరెక్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎలా ఎదురు చూస్తారో అలా ఈ రోజు ఉదయం నుండే సాయంత్రం వచ్చే ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.మొత్తానికి రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాపై హైప్ అయితే భారీగా పెరిగింది.
ఇక సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.కాగా ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ( Ketika Sharma ) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండగా థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాలి.