సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ఒకరు.కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం ఇతర భాష సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.
ఈ విధంగా వరుస భాష చిత్రాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

కొన్నిసార్లు రష్మిక సోషల్ మీడియాలో చేసే పోస్టులు కారణంగా కూడా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు.అయితే తాజాగా ఓ కార్యక్రమంలో భాగంగా రష్మిక చేసినటువంటి కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ తన సినీ కెరీర్ గురించి పలు విషయాలు తెలియజేశారు.మనం కష్టపడి పని చేస్తే ఏ రంగంలో అయినా కూడా మంచి సక్సెస్ సాధించవచ్చని ఈమె తెలిపారు.
తాను కూడా మొదట్లో మోడలింగ్ ( Modaling ) రంగంలోకి అడుగు పెట్టానని రష్మిక ఈ సందర్భంగా తెలిపారు.

మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన తాను అనంతరం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చానని అయితే సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అనేది చాలా ముఖ్యమని రష్మిక తెలిపారు.అయితే తాను ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాన్ని చేజేతులారా జార విడ్చుకున్నందుకు ఇప్పటికి బాధపడుతున్నానని ఈ సందర్భంగా రష్మిక తెలియజేశారు.తనకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) హీరోగా నటించిన ఆచార్య( Aacharya ) సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్( Vijay ) నటించిన మాస్టర్ ( Master )సినిమాలో కూడా నటించే అవకాశం వచ్చింది.అయితే ఈ రెండు సినిమాలను తాను వదులుకొని ఇప్పటికీ ఈ విషయంలో బాధపడుతూనే ఉన్నానని రష్మిక ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.