తెలంగాణ వ్యాప్తంగా రేపు విద్యాసంస్థలు బంద్ కానున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కాలేజీల బంద్ కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
ఇందులో భాగంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ప్రైవేట్ స్కూళ్లు విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
హైదరాబాద్ లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో సమావేశమైన వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు ఈ విషయాన్ని వెల్లడించారు.