రామ్ ఇస్మార్ట్ ట్రాన్స్ఫర్మేషన్.. వీడియోతో ఫ్యాన్స్ కు పూరీ ఫుల్ కిక్!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో స్కంద సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా షూట్ పూర్తి అయ్యింది.

 Double Ismart Transformation Video Of Ram Pothineni, Ram Pothineni, Sreeleela-TeluguStop.com

శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నారు.అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Telugu Charmme Kaur, Double Ismart, Doubleismart, Puri Jagannadh, Ram Pothineni,

ఇక ఈ సినిమా షూట్ పూర్తి కాగానే రామ్ తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసాడు.రామ్ పోతినేని మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో ”డబుల్ ఇస్మార్ట్( Double ISMART )” తెరకెక్కనుంది.ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించగా నిన్న అధికారికంగా లాంచ్ అయ్యింది.ఈ సినిమా ఓపెనింగ్ లో ఛార్మి క్లాప్ కొత్తగా హీరో రామ్ పై పూరీ స్వయంగా యాక్షన్ చెప్పారు.

Telugu Charmme Kaur, Double Ismart, Doubleismart, Puri Jagannadh, Ram Pothineni,

ఇక ఈ సినిమా రెగ్యురల్ షూట్ జులై 12 నుండి స్టార్ట్ కానుంది అని తెలిపారు.ఈ సినిమాను లాంచ్ చేసారో లేదో అప్పుడే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు.ఈ రోజు మరో అప్డేట్ ను అందిస్తూ అదిరిపోయే వీడియో రిలీజ్ చేసారు.ఇప్పటి వరకు రామ్ బోయపాటితో చేస్తున్న స్కంద సినిమా లుక్ లో ఉండగా ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కోసం మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ లుక్ లోకి మారిపోయాడు.

రామ్ ఇస్మార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోను రిలీజ్ చేసారు.దీంతో ఈ సినిమాపై మళ్ళీ పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమాను ఛార్మి కౌర్ తో కలిసి పూరీ కనెక్ట్స్ పై విష్ణు రెడ్డి( Vishnu Reddy ) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.కాగా ఈ సినిమా ప్రకటన రోజునే వచ్చే ఏడాది మార్చి 8న రిలీజ్ చేయబోతున్నాం అంటూ ప్రకటించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube