రాజన్న సిరిసిల్ల జిల్లా: సబ్బండా వర్ణల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం అని రుద్రంగి జడ్పీటీసీ గట్ల మీనయ్య అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయం, సార్గమ్మవద్ద జడ్పీ నిధులచే ఏర్పాటు చేసిన హైమాస్ లైట్స్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, సహకారంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో పలు పథకాలను చేపట్టి అమలు చేసిన ఏకైక సీఎంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చరిత్రలో నిలిచారన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గట్ల మీణయ్య, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం నాయకులు గంగం మహేష్ కంటే రెడ్డి,దయ్యాల కమలాకర్, చెప్యాల గణేష్, దేవస్థాన కమిటీ చైర్మన్ మంచే రమేష్ ,సెక్రెటరీ పిల్లమారపు ప్రవీణ్,పద్మశాలి కుల సభ్యులు పాల్గొన్నారు.







