సినీ ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్ లు ఉంటాయి.ఆ కాంబినేషన్ లో సినిమా వచ్చిందటే చాలు అంచనాలు తారాస్థాయికి వెళ్తాయి.
ఇండస్ట్రీలో బోయపాటి శ్రీను – బాలకృష్ణ అంటే ఒక క్రేజీ కాంబినేషన్.అలానే త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్( Trivikram-Pawan Kalyan ) అంటే హిట్ కాంబినేషన్ అనాల్సిందే.
అయితే కొన్నిసార్లు క్రేజీ కాంబోలు మాత్రం మిస్ అవుతుంటాయి.ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ సెట్ చేయాలంటే చాలా సమయం పడుతుంది.
మరి కొన్ని అయితే ఎంత ట్రై చేసిన ఆ కాంబినేషన్ లు మాత్రం సెట్ అవ్వవు.ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొడుతాయి.
అలంటి కాంబోనే శంకర్-నితిన్ ది.స్టార్ డైరెక్టర్స్ లో శంకర్( Shankar ) ఖచ్చితంగా టాప్ లో ఉంటారు.ఆయన సినిమాలు, బడ్జెట్ లు గురించి అయితే కొత్తగా చెప్పనక్కర్లేదు.పాటల కోసమే శంకర్ కోట్లు పెట్టిస్తారు అనే టాక్ కూడా ఉంది.బడ్జెట్ విషయంలో శంకర్ తగ్గేదేలే అంటారు.ఏ హీరో అయినా శంకర్ తో ఒక్క సినిమా చేయాలని ఆశపడుతుంటారు.
ఆ ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోరు.అయితే ఒక యంగ్ హీరో( Young Hero ) మాత్రం శంకర్ కు నో చెప్పారంట.
ఆ యంగ్ హీరో ఎవరో కాదు నితిన్( Nitin ).శంకర్ సినిమాల్లో బాయ్స్ సినిమాకి ఒక సెపెరేట్ క్రేజ్ ఉంటుంది.అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి భారీ కలెక్షన్స్ సాధించింది.శంకర్ కెరీర్ లోనే బాయ్స్( Boys ) బెస్ట్ సినిమా అయ్యింది.హీరో సిద్ధార్ధ్ కెరియర్ ని మలుపు తిప్పింది కూడా బాయ్స్ సినిమా అనే చెప్పాలి.అయితే ఈ సినిమా ముందు నితిన్ కి వచ్చిందంట.
అయితే నితిన్ అప్పుడు జయం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
దీంతో శంకర్ సినిమాకు నితిన్ రిజెక్ట్ చేసారు.ఈ విషయాన్నీ నితిన్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.“శంకర్ ఇంటికి వచ్చి కధ చెప్పి.
ఆ స్టోరి నచ్చినప్పుడు.ఛీ ఛీ నా దరిద్రం ఇలా ఉందేంటి.
కమిట్ అయిన సినిమాను వదులుకోలేను.ఈ సినిమా ఛాన్స్ వదులుకోలేను .ఏంటి నా పోజీషన్ అని భాపపడ్డానని నితిన్ చెప్పారు.అయితే నితిన్ టైం మేనేజ్ చేసి జయంతో( jayam ) పాటు బాయ్స్ సినిమా చేసి ఉంటె నితిన్ కి వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చేవి.
అప్పుడే కాదు ఇప్పటికి నితిన్ కొన్ని సినిమాలు ఎంచుకునే విషయంలో మిస్టేక్స్ చేస్తూనే ఉన్నారని టాక్ ఉంది.శంకర్ – నితిన్ కలిసి సినిమా చేసే ఛాన్స్ వస్తుందో లేదో మరి.