బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha ) డిల్లీ లిక్కర్ స్కామ్ లో( Delhi Liquor Scam ) నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పలు మార్లు ఆమె ఈడీ విచారణ( ED ) ఎదుర్కొన్నారు కూడా.
కాగా ఆమె అరెస్ట్ తప్పదని, తప్పు చేసినవాళ్లు తప్పించుకోలేరని బీజేపీ నేతలు మొదటి నుంచి చెబుతూ వచ్చారు.అయితే ఏమైందో తెలియదుగాని గత కొన్ని రోజులుగా కవితా డిల్లీ లిక్కర్ స్కామ్ ఒక్కసారిగా సైలెంట్ అయింది.
బీజేపీ నేతలు కూడా ఈ కేసుపై పెద్దగా స్పందించడం లేదు.మరోవైపు బిఆర్‌ఎస్ నేతలు కూడా బీజేపీని విమర్శలు చేయడం మానేశారు.
దీంతో బిఆర్‌ఎస్ మరియు బీజేపీ మద్య దోస్తీ కుదిరిందని అందుకే కవితా లిక్కర్ కేసు హోల్డ్ లో పడిందని ఇలా రకరాల వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే బీజేపీతో రాజీ పడే ప్రసక్తే లేదని ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కలలో కూడా జరగదని ఇటీవల కేసిఆర్ మరియు కేటిఆర్ స్పష్టం చేశారు.
దీంతో మరెందుకు కవిత లిక్కర్ కేసు ప్రస్తావన ఊసే లేదు అనే డౌట్ అందరిలోనూ వ్యక్తమౌతోంది.కాగా ప్రతిపక్షలను ఇరుకున పెట్టేందుకు ఈడీ, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్న కేంద్రానికి.
లిక్కర్ స్కామ్ లో కవితను దోషిగా నిలిపే ఆధారాలు దొరకడం లేదా అనే డౌట్ వ్యక్తమౌతోంది.

తాము తప్పు చేయనప్పుడు భయపడే ప్రసక్తే లేదని అటు బిఆర్‌ఎస్ కాన్ఫిడెంట్ గా చెబుతోంది.దీంతో కేవలం బిఆర్‌ఎస్ ను దెబ్బ తీసేందుకే ఏమాత్రం సంబంధం లేని కవితను లిక్కర్ స్కామ్ లో ఇరికించే ప్రయత్నం జరుగుతోందా అనేది కొందరి భావన.అయితే బీజేపీ పక్కా ప్రణాళికతోనే ఉందని సరిగ్గా ఎన్నికల టైమ్ లో బిఆర్‌ఎస్ ను దెబ్బ తీసేలా కవితా కేసును మళ్ళీ తెరపైకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇటీవల బీజేపీ నేత దర్మపురి అరవింద్ వ్యాఖ్యలను బట్టి చూస్తే నిజమేనేమో అనే డౌట్ రాకమానదు.కవితా అరెస్ట్ కావడం ఖాయమని, లిక్కర్ స్కామ్ లో ఆమె నిందితురాలిగా ఉన్నారని ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూ లో ఆయన చెప్పుకొచ్చారు.దీంతో అతర్గతంగా కవితా అరెస్ట్ కోసం బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లే కనిపిస్తోంది.మరి కవిత అరెస్ట్ లో బీజేపీ వ్యూహాలను కేసిఆర్ ఎలా దెబ్బకొడతారో చూడాలి.