తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో అల్లు ఫ్యామిలీ( Allu Family ) ఒకటి.అల్లు రామలింగయ్య కమెడియన్ గా సినిమాలలో నటిస్తూ తన కుమారుడు అల్లు అరవింద్ ( Allu Aravind ) ను ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం చేశారు.
ఇక నిర్మాతగా ఈయన ఎంతో మంచి సక్సెస్ సాధించారు.అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ ( Allu Arjun ) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమా ( Pushpa 2Movie ) షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి ( Sneha Reddy ) తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ( Chandrasekhar Reddy ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన అల్లుడు అల్లు అర్జున్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు.ఈ క్రమంలోని యాంకర్ తనని ప్రశ్నిస్తూ అల్లుడిగా అల్లు అర్జున్ కు మీరు ఎన్ని మార్కులు వేస్తారు అంటూ ప్రశ్నించడంతో ఆయన నేను తనకి అల్లుడుగా వందకు వంద మార్కులు వేస్తాను.
ఇక నటుడిగా ప్రేక్షకులు ఆయనకు మార్కులు వేయాల్సి ఉంటుందని ఈయన తెలియజేశారు.అయితే మనదేశంలో ఎక్కడికి వెళ్లినా అల్లు అర్జున్ పాటలు వినపడుతూ ఉంటాయని అలా ఆయన క్రేజ్ సంపాదించుకున్నారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
ఇక చంద్రశేఖర్ రెడ్డి ఎన్నో విద్యాసంస్థలను నడుపుతున్నారనే విషయం మనకు తెలిసిందే.ఈయన తన కుమార్తె స్నేహ రెడ్డిని అల్లు అర్జున్ కి ఇచ్చే సమయంలో కొన్ని వందల కోట్ల రూపాయలను కట్నంగా ఇచ్చారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈ ఇంటర్వ్యూలో భాగంగా అల్లు అర్జున్ కు మీరు ఎంత కట్నం ఇచ్చారు అంటూ ప్రశ్నించడంతో ఈయన అసలు విషయం వెల్లడించారు.అల్లు అర్జున్ కు నేను ఒక్క రూపాయి కూడా కట్నం ఇవ్వలేదని తెలిపారు.
వారి వద్ద చాలా సంపద ఉంది అలాంటప్పుడు కట్నం గురించి ఎందుకు అడుగుతారు.అల్లు అర్జున్ ఒక్క రూపాయి కట్నం కూడా తీసుకోలేదనీ ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.