ప్రతి వారం థియేటర్లు, ఓటీటీలలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి.జూన్ చివరి వారమైన ఈ వారంలో కూడా పలు క్రేజీ సినిమాలు థియేటర్లలో, ఓటీటీలలో రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది.
ఈ వారం రిలీజవుతున్న సినిమాలలో స్పై సినిమాపై( Spy Movie ) మంచి అంచనాలు నెలకొన్నాయి.వరుస విజయాల తర్వాత నిఖిల్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని నిఖిల్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
శ్రీవిష్ణు హీరోగా వినూత్న ప్రేమకథగా తెరకెక్కిన సామజవరగమన సినిమా( Samajavaragamana Movie ) కూడా ఈ వారం థియేటర్లలో విడుదల కానుంది.జూన్ 29వ తేదీన ఈ రెండు సినిమా రిలీజ్ కానుండగా వేర్వేరు జానర్లలో ఈ సినిమాలు తెరకెక్కాయి.

ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ సినిమా కూడా ఈ వారం థియేటర్లలో విడుదల కానుంది.ఈ సిరీస్ లో 14 సంవత్సరాల తర్వాత వస్తున్న మూవీ ఇదే కావడం గమనార్హం.ప్రముఖ దర్శకుడు దశరథ్ నిర్మించిన లవ్ యూ రామ్( Love You Ram Movie ) ఈ నెల 30వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.మాయాపేటిక( Mayapetika ) అనే చిన్న మూవీ కూడా ఈ వారం థియేటర్లలో రిలీజవుతోంది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జాన్ ర్యాన్ వెబ్ సిరీస్ ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది.

నెట్ ఫ్లిక్స్ లో టైటాన్ వెబ్ సిరీస్ జూన్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుండగా లస్ట్ స్టోరీస్2 జూన్ 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.సీయూ ఇన్ మై నైన్టీస్ లైఫ్ కొరియన్ సిరీస్ జూన్ 29న, అఫ్వా హిందీ వెర్షన్ జూన్ 30వ తేదీన, సెలెబ్రిటీ కొరియన్ సిరీస్ జూన్ 30వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వీకెండ్ ఫ్యామిలీ వెబ్ సిరీస్ జూన్ 28న స్ట్రీమింగ్ కానుండగా ది నైట్ మేనేజర్ సిరీస్ జూన్ 30న స్ట్రీమింగ్ కానుంది.
బుక్ మై షోలో ఫాస్ట్ ఎక్స్ హాలీవుడ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా జియో సినిమాలో సార్జెంట్ హిందీ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా ఆహా ఓటీటీలో అర్థమైందా అరుణ్ కుమార్ అనే తెలుగు సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.