టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో( Devara Movie ) హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ కు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.
మరీ ముఖ్యంగా జపాన్ లాంటి దేశాలలో ఎన్టీఆర్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.అందరూ డైహాడ్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు.రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా తారక్ కోసం ప్రాణాలు ఇచ్చే వారు ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.తారక్ అంటే అంత పిచ్చి మరి.అలా తారక్ డైహాడ్ ఫ్యాన్స్ లో ఒక వీరాభిమాని తాజాగా మృతి చెందడంతో తారక అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.చిన్న వయసులోనే మరణించడంతో తారక్ అభిమానులు ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

అసలు ఆ అసలు ఆ డై హార్డ్ ఫ్యాన్ ఎవరు? అతనికి ఏం జరిగింది? అన్న విషయాల్లోకి వెళ్తే.శ్యామ్ ( Shyam ) కుర్రాడికి చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే పిచ్చి.ఎక్కడ ఎన్టీఆర్ కు సంబంధించిన ఈవెంట్ జరిగినా కూడా అక్కడికి వెళ్లేవాడు.అంతేకాకుండా ఆ ఈవెంట్ పనులన్నీ కూడా దగ్గరుండి చూసుకునేవాడు.కొన్ని నెలల క్రితం యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆ ఫంక్షన్‌కు కూడా వచ్చాడు శ్యామ్.

ఎన్టీఆర్ వేదిక పై ఉండగానే తన అభిమాన హీరోను గట్టిగా హత్తుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.అలా ఎన్టీఆర్ అంటే అంత అభిమానం ఉన్న శ్యామ్ ఊహించని విధంగా చిన్న వయసుకే మృతి చెందాడు.అయితే ఆ యువకుడు ఎలా చనిపోయాడు అన్న వివరాల మాత్రం తెలియడం లేదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్యామ్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రిప్ అంటూ పోస్టులు పెడుతున్నారు.