బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు ప్రచారంపై స్పందించారు.తాను బీజేపీలోనే ఉన్నానన్న ఆయన ఊహాగానాలు నమ్మొద్దని సూచించారు.
హైకమాండ్ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్తున్నామన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తమ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానానికి వివరిస్తామని చెప్పారు.రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని పేర్కొన్నారు.
అందులో భాగంగానే కేటీఆర్ కు కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ దొరికిందని తెలిపారు.ఎక్కడైనా రాజకీయాలు వేరు.
అభివృద్ధి వేరన్న కోమటిరెడ్డి ఆ రెండింటినీ కలపవద్దని సూచించారు.