స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) ఏ నటుడినైనా ఎంతో ప్రతిభ ఉంటే తప్ప ప్రశంసించరనే సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబోలో వచ్చిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
అయితే రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ లోని వీరత్వాన్ని ఆది సినిమా( Aadi )లో చూపించారని చెప్పుకొచ్చారు.జయప్రద రాజమౌళిని అమూల్ బేబీ లాంటి ఎన్టీఆర్ ను అగ్రెసివ్ యాక్షన్, ఎమోషన్ రోల్స్ లో ఎలా చూపించారని అడగగా జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
స్టూడెంట్ నంబర్ వన్ సినిమా చేసిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మంచి యాక్టర్ అని తెలుసని తారక్ తో కొంత సమయం స్పెండ్ చేస్తే తారక్ టాలెంట్ ఏంటో మనకు తెలిసిపోతుందని రాజమౌళి తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ మెమొరీ పవర్ కానీ ఎన్టీఆర్ మాట్లాడే విధానం కానీ తారక్ తెలివితేటలు కానీ తారక్ యాక్టింగ్ స్కిల్స్ కానీ ఇట్లే కనబడిపోతూ ఉంటాయని రాజమౌళి వెల్లడించడం గమనార్హం.
స్టూడెంట్ నంబర్ 1 ( Student No: 1 )సినిమాలో నేను తారక్ లోని కొన్ని కోణాలను మాత్రమే ఆవిష్కరించడం జరిగిందని జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న యాంగ్రీ యంగ్ మేన్ ను, వీరత్వాన్ని ఆది సినిమాలో వి.వి.వినాయక్ చూపించారని రాజమౌళి చెప్పుకొచ్చారు.ఆది సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కు నిజంగా స్టార్ డమ్ వచ్చిందని జక్కన్న చెప్పుకొచ్చారు.
ఆ స్టార్ డమ్ ను సింహాద్రి మూవీలో క్యాపిటజైజ్ చేశామని రాజమౌళి కామెంట్లు చేశారు.
పౌరాణికం అనేది నాకు బాగా ఇష్టమని సీనియర్ ఎన్టీఆర్ సినిమాలను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగామని జక్కన్న చెప్పుకొచ్చారు.జక్కన్న తాజాగా కొత్త యాడ్ లో నటించగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.రాబోయే రోజుల్లో రాజమౌళి యాక్టర్ గా కూడా కొనసాగుతారేమో చూడాల్సి ఉంది.