గోపిచంద్( Gopichand ) హీరో గా వరుసగా సినిమాలు చేస్తున్నారు కానీ అందులో ఒక్క సినిమా కూడా గోపిచంద్ కి సరైన సక్సెస్ ఇవ్వడం లేదు ఇక దాంతో గోపి చంద్ తర్వాత ఏం సినిమా చేయాలి అనేదాని మీద ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు గా తెలుస్తుంది…ఇక రీసెంట్ గా గోపిచంద్ చేసిన సినిమాల్లో సీటిమార్ ఒక్క సినిమా కొంచం పర్వాలేదు అనిపించినా కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను మాత్రం అందుకోలేక పోయింది…
తర్వాత చేసిన పక్కా కమర్షియల్ మరియు రామ బాణం మూవీస్ రెండూ కూడా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయాయి.ఇలాంటి టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ రొటీన్ మూవీస్ ని పక్కకు పెట్టి డిఫెరెంట్ మూవీస్ చేయాలనీ అందరూ కోరుకోగా…
అందరూ కోరుకున్నట్లే గోపీచంద్ ఇప్పుడు భీమా(Bhimaa) అనే డిఫెరెంట్ మూవీ చేస్తున్నాడు, ఈ సినిమాలో గోపీచంద్ పోలిస్ రోల్ చేస్తూ( Gopichand in Police Roll ) ఉండగా తన కెరీర్ లో చివరి సారి గోపీచంద్ పోలీస్ రోల్ లో నటించిన సినిమా వచ్చి 13 ఏళ్లకు పైగా టైం అవుతూ ఉంది….
ఆ సినిమానే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన గోలీమార్ మూవీ( Golimar movie )…ఆ సినిమా తర్వాత ఎందుకనో గోపీచంద్ పోలీస్ రోల్ లో అయితే నటించలేదు.మళ్ళీ ఇప్పుడు ఆల్ మోస్ట్ 13 ఏళ్ల తర్వాత తిరిగి పోలీస్ రోల్ లో భీమా సినిమాలో కనిపించ బోతున్నడు గోపీచంద్…
ఫుల్ మాస్ కంటెంట్ తో రగ్గుడ్ లుక్ తో రాబోతున్నాడు….ఫ్రెష్ కాంబినేషన్ లో మాస్ కంటెంట్ తో రాబోతున్న గోపీచంద్ గోలీమార్ తో అప్పట్లో బాగానే మెప్పించాడు.ఇప్పుడు తిరిగి ఇన్నేళ్ళకి ఫుల్ పోలీస్ రోల్ లో భీమాతో రాబోతున్న గోపీచంద్ ఎంతవరకు ఆడియన్స్ ను మెప్పిస్తాడో చూడాలి…ఈ సినిమా కనక హిట్ అయితే గోపిచంద్ కి మంచి అవకాశాలు వస్తాయి…ఇక ఇప్పటికే నిన్న గోపిచంద్ బర్త్ డే సందర్భంగా గా భీమా ఫస్ట్ లుక్ వదిలారు మేకర్స్… దాంట్లో గోపి చంద్ మంచి రగ్గుడ్ లుక్ లో కనిపిస్తున్నాడు…
.