టోమాటో సాగును( Tomato ) ఆశించే స్పాటేడ్ విల్డ్ వైరస్( Spotted Wilt Virus ) అనేది ఉల్లి తామర పురుగులు, మిరప తామర పురుగుల జాతికి చెందిన తామర పురుగుల వలన సంక్రమిస్తుంది.ఈ వైరస్ ను తొలిదశలో అరికట్టకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
ఎందుకంటే ఈ వైరస్ సోకిన మొక్కల ఆకులు తిన్న పురుగులు మరొక మొక్క ఆకులు తిన్నప్పుడు ఈ వైరస్ అన్ని మొక్కలకు వ్యాప్తి చెందుతుంది.
టోమాటో మొక్క ఆకులపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మొక్క ఎదుగుదల మందగిస్తుంది.
పక్వానికి రాని పండ్లపై లేత పచ్చ రంగు వృత్తాకార మచ్చలు ఏర్పడతాయి.ఈ వైరస్ మొక్క యొక్క కణజాలాలను నాశనం చేస్తుంది.

ఈ వైరస్ టోమాటో పంటను( Tomato Crop ) ఆశించకుండా ఉండాలంటే మొదట తెగులను తట్టుకునే మేలు రకం విత్తనాలను నాటుకోవాలి.పొలంలో ఎప్పటికప్పుడు కలపును తొలగిస్తూ ఉండాలి.తెగులు సోకిన మొక్కలను గుర్తించి వెంటనే పొలం నుండి తొలగించి నాశనం చేయాలి.తక్కువ మోతాదులో నత్రజని ఎరువులను వాడాలి.మొక్కలకు సరిపడా నీరు మాత్రమే పెట్టాలి.

టోమాటో మొక్కలపై ఈ వైరస్ ను గుర్తిస్తే ముందుగా సేంద్రీయ పద్ధతిలో నివారణ చర్యలు చేపట్టాలి.మొక్కల ఆకుల కింది భాగంలో వేప నూనె లేదా స్పైనోసాడ్ లను ఉపయోగించి వివిధ రకాల తామర పురుగులను నియంత్రించవచ్చు.ఈ పురుగులను అరికడితే వైరస్ వ్యాప్తి తగ్గుతుంది.
అంతేకాదు అల్లం కషాయాన్ని కొన్ని రకాల కీటక నాశినిలతో కలిపి ఈ వైరస్ ను అరికట్టవచ్చు.
ఒకవేళ ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లయితే తప్పనిసరి పరిస్థితిలో రసాయన పద్ధతిలో నియంత్రించాలి.
తామర పురుగులను అరికట్టడానికి అజాడిరచితిన్ లేదా పెరిత్రోయిడ్స్ రసాయన పిచికారి మందులకు పెప్పరోనిల్ బుటాక్సైడ్ కలిపి ఈ పురుగులను నియంత్రిస్తే వైరస్ వ్యాప్తి అరికట్టబడి పంట సంరక్షించబడుతుంది.