టాలీవుడ్ లో నటుడు శ్రీవిష్ణు ( Sree Vishnu )తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.తెలుగు ఆడియెన్స్ దగ్గర మంచి నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు.
మరి ఈ యంగ్ నటుడు తాజాగా నటించిన మూవీ ”సామజవరగమన”.ఈ సినిమా ఈ రోజు మళ్ళీ వార్తల్లో నిలిచింది.
ఎందుకంటే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఈ రోజు అనౌన్స్ చేసారు.ఈ సినిమా ముందుగా మే 18న థియేటర్ లలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
అయితే మళ్ళీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేశారు.ఇక ఇప్పుడు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.
జూన్ 29న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ఈ రోజు అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.దీంతో ఈసారి శ్రీవిష్ణు బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియన్ స్టార్ తో పోటీ పడనున్నాడు.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఇదే రోజు ‘స్పై( SPY )’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది.యాక్షన్ థ్రిల్లర్ గా బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో శ్రీవిష్ణు పోటీ పడి బాక్సాఫీస్ దగ్గర విజయం సాధిస్తాడా లేదా అనేది చూడాలి.
ఇక ఈ సినిమాను వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు( Ram Abbaraju )దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బిగిల్ ఫేమ్ రెబా మౌనికా జాన్(Reba Monica John ) కథానాయికగా నటిస్తుంది.ఇక సామజవరగమన సినిమాలో నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ వంటి వారు కీలక పాత్రలో నటించగా.ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ పై ఈ సినిమాను రాజేష్ దండా నిర్మించారు.
అలాగే గోపి సుందర్ సంగీతం అందించారు.